కరోనా కట్టడికోసం.. ‘రెమ్డెసివిర్’..!

| Edited By:

Jun 10, 2020 | 4:57 PM

కొవిడ్‌-19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దీని కట్టడికోసం వ్యాక్సిన్‌తో పాటు ఔషధంపై కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రయోగాలు జరుగుతున్నాయి. అమెరికాకు చెందిన గిలీడ్‌ సైన్సెస్‌ సంస్థ అభివృద్ధి చేసిన 'రెమ్డెసివిర్‌' ఔషధాన్ని

కరోనా కట్టడికోసం.. రెమ్డెసివిర్..!
Follow us on

Gilead’s Remdesivir: కొవిడ్‌-19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దీని కట్టడికోసం వ్యాక్సిన్‌తో పాటు ఔషధంపై కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రయోగాలు జరుగుతున్నాయి. అమెరికాకు చెందిన గిలీడ్‌ సైన్సెస్‌ సంస్థ అభివృద్ధి చేసిన ‘రెమ్డెసివిర్‌’ ఔషధాన్ని కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా ఇప్పటికే పలు దేశాల్లో ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కోతుల్లో జరిపిన ప్రయోగాల్లో ఊపిరితిత్తులు దెబ్బతినడాన్ని ఈ ఔషధం నిరోధిస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. దీనికి సంబంధించిన పరిశోధన పత్రం ప్రముఖ జర్నల్‌ నేచర్‌లో ప్రచురితమైంది.

కాగా.. ట్రయల్స్ లో భాగంగా తొలుత 12 కోతులకు కరోనా వైరస్‌ సోకించారు. అనంతరం వీటిలో ఆరు కోతులకు రెమ్డెసివిర్ ఔషధాన్ని అందించారు. దీంతో ఈ మందు స్వీకరించిన కోతుల్లో ఎలాంటి శ్వాసకోస సంబంధ వ్యాధులు బయటపడలేదు. అంతేకాకుండా ఈ మందులు ఊపిరితిత్తులు దెబ్బతినడాన్ని తగ్గించినట్లు పరిశోధనల్లో తేలినట్లు ఆ నివేదిక వెల్లడించింది. రెమ్డెసివిర్ పై విస్తృతంగా పరిశోధనలు జరుపుతున్నారు. కరోనా వైరస్ బాధితులపై వినియోగించడానికి ఇదివరకే అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అత్యవసర అనుమతి (ఎమెర్జెన్సీ యూజ్‌ ఆథరైజేషన్‌) ఇచ్చింది.