జీహెచ్ఎంసీ వినూత్న ప్రయోగం.. ‘ఆ’ వ్యర్థాలకు రీసైక్లింగ్‌తో చెక్

|

Nov 07, 2020 | 7:03 PM

హైదరాబాద్ మహా నగరాన్ని వేధిస్తున్న ఓ జఠిలమైన సమస్యకు పరిష్కారం కనిపెట్టే దిశగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఓ కీలక ముందడుగు వేసింది. నగరంలో ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోతున్న వ్యర్థాలను ఇకపై..

జీహెచ్ఎంసీ వినూత్న ప్రయోగం.. ‘ఆ’ వ్యర్థాలకు రీసైక్లింగ్‌తో చెక్
Follow us on

GHMC variety experiment on wastage:  హైదరాబాద్ మహానగరంలో పెరిగిపోతున్న భవన నిర్మాణ వ్యర్థాలను ఇకపై రీసైక్లింగ్ చేయబోతున్నారు. ఇప్పటికే హైదరాబాదులో వేలాది టన్నుల భవన వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. అందుకే జీడిమెట్లలోని వేస్ట్ మెటీరియల్‌తో మళ్ళీ నిర్మాణాలకు పనికొచ్చే బెస్ట్ మెటీరియల్‌ను రెడీ చేశారు. హైదరాబాదులో రోజూ లక్షలాది ఇళ్ళు కూల్చడం.. కొత్తవి కట్టడం జరుగుతుంది. ఈ క్రమంలో భవన నిర్మాణానికి సంబంధించి వ్యర్దాలు టన్నుల కొద్దీ పెరుకుపోతున్నాయి. దీంతో వాటిని రీసైకిలింగ్ చేసేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జీహెచ్ఎంసీ.

జీడిమెట్లలో 15 ఎకరాలలో రీసైక్లింగ్ ప్లాంట్‌ను ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో ఏర్పాటు చేశారు. సిటీలో ఎక్కడ భవన వ్యర్దాలు ఉన్నా వాటిని వెంటనే జీహెచ్ఎంసీకిగానీ, రాంకీ టోల్ ఫ్రీ నెంబర్‌కిగానీ కాల్ చేసి చెబితే.. వాటిని తీసుకు పోయేలా ఏర్పాట్లు చేశారు. భవన వ్యర్థాలను స్వయంగా కూడా ప్లాంట్ దగ్గరకు డంప్ చేయొచ్చు. ఐదు దపాలుగా ఇక్కడ పని నడుస్తూ ఉంటుంది. రోజుకు 500 టన్నుల రీసైకిల్ చేసే సామర్థ్యంతో ప్రస్తుతం ప్లాంట్ ఏర్పాటు చేశారు. భవిష్యత్ లో ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచే విధంగా ఏర్పాటు చేస్తున్నారు.

రీసైకిలింగ్ అయిన తరువాత 4 రకాల మెటీరియల్ బయటకి వస్తుంది. 80ఎంఎం కంకర, 40 ఎంఎం కంకర, 40ఎంఎం ఇసుక, 20 ఎంఎం ఇసుక మిషన్స్ ద్వారా బయటకు వస్తుంది. ఇక్కడ నుండి వచ్చిన మెటీరియల్ నిజంగా అంత నాణ్యతగా ఉంటుందా? ఏవిధంగా ఎక్స్‌పోర్టు చేస్తారు. భవిష్యత్తులో ప్లాంట్స్ ఎక్కడ ఓపెన్ చేయబోతున్నారు? అనే అంశాలు కీలకంగా మారాయి. రీసైక్లింగ్ ప్లాంట్ల వల్ల పర్యావరణానికి చాలా మేలు జరుగుతుందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వ్యర్థాలను తొలగించడంతో పాటు రీసైక్లింగ్ ద్వారా తక్కువ ధరకు మెటీరియల్ దొరకడం అనేది శుభపరిణామంగా భవన నిర్మాణ కాంట్రాక్టర్లు చెబుతున్నారు.

ALSO READ: నాగేంద్రకు 14 రోజుల రిమాండ్

ALSO READ: కేంద్రం ఒక్క పైసా ఇవ్వలే.. మండిపడ్డ కేసీఆర్

ALSO READ: బీహార్‌లో అధికారం వారిదే.. తేల్చిన ఎగ్జిట్ పోల్స్

ALSO READ: జీహెచ్ఎంసీకి హడ్కో అవార్డు.. కేటీఆర్ ప్రశంస