హైద‌రాబాద్‌లో జీహెచ్ఎంసీ డ్రై డే!

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో నగరంలో జీహెచ్‌ఎంసీ డ్రై డేను నిర్వ‌హించింది. కూక‌ట్‌ప‌ల్లిలో దోమ వేషంతో

హైద‌రాబాద్‌లో జీహెచ్ఎంసీ డ్రై డే!

Edited By:

Updated on: Jun 21, 2020 | 6:55 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో నగరంలో జీహెచ్‌ఎంసీ డ్రై డేను నిర్వ‌హించింది. కూక‌ట్‌ప‌ల్లిలో దోమ వేషంతో ప్ర‌జ‌ల‌కు అధికారులు అవ‌గాహ‌న క‌ల్పించారు. అంతేకాదు పలు కాలనీలతో పాటు ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద దోమ వేషంలో అవగాహన కల్పించారు. ఇల్లు, పరిసరాలను శుభ్రoగా ఉంచుకోవాలని సూచించారు.

ఇళ్లల్లో పూలకుండీలు, డ్రమ్ములు, ట్యాంకులలో నిల్వ వున్న నీటిని తొలగించుకోవాలని చెప్పారు. ట్యాంకులలో నిల్వ వున్న నీటిని తొలగించుకోవాలని, ఇంటి పైకప్పులు, పనికిరాని ప్లాస్టిక్, ఇనుప వస్తువులు, టైర్లలో నిలిచివున్న నీటిని తొలగించాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే దోమల వ్యాప్తిని నియంత్రణ విజయవంతం అవుతుందని అధికారులు తెలిపారు.