GHMC Elections: గ్రేటర్ ఓటర్ స్లిప్ అందలేదా..? అయితే ఇలా సులువుగా పొందండి…

జీహెచ్‌ఎంసీ పోలింగ్‌ ప్రారంభమయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్ స్లిప్‌లతో పోలింగ్ కేంద్రాలకు రావల్సి ఉంటుంది.

GHMC Elections: గ్రేటర్ ఓటర్ స్లిప్ అందలేదా..? అయితే ఇలా సులువుగా పొందండి...
Follow us
Balaraju Goud

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 01, 2020 | 10:37 AM

జీహెచ్‌ఎంసీ పోలింగ్‌ ప్రారంభమయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్ స్లిప్‌లతో పోలింగ్ కేంద్రాలకు రావల్సి ఉంటుంది. అయితే, ఒక వేళ మీ ఓటర్ స్లిప్‌ ఇంకా రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదని ఎలక్షణ్ కమిషన్ తెలిపింది. ఓటర్ స్లిప్‌ను సులభంగా మీ కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

ఓటర్ స్లిప్ ఇదిగో ఇలా చేయండి!

ఓటర్ స్లిప్‌ కోసం ముందుగా కంప్యూటర్ లేదా మొబైల్‌ బ్రౌజర్‌లోకి వెళ్లి voterslipulb.tsec.gov.in అని టైప్ చేయండి. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జిల్లా, అర్బన్‌/లోకల్ బాడీ అనే సెక్షన్స్‌లో హైదరాబాద్, జీహెచ్‌ఎంసీ అని ఉంటాయి. అందులో జీహెచ్ఎంసీ అని క్లిక్ చేయండి. తర్వాతి సెక్షన్‌లో మీ వార్డ్‌ నంబర్‌ సెలెక్ట్ చేసి, కింద ఓటర్ ఐడీ నంబర్‌ ఎంటర్ చేసి సెర్చ్ కొడితే మీ ఓటర్‌ స్లిప్‌ చూసిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని మీ ఓటు హక్కు ఉపయోగించుకోవచ్చు. అందులోనే మీ పోలింగ్ బూత్ వివరాలు కూడా ఉంటాయి.

జాతీయ ఓటర్ సర్వీస్ పోర్టల్ వెబ్‌సైట్ ద్వారాః

searchvoterslipulb.tsec.gov.in లింక్‌ ఓపెన్ చేయండి. ఆ తర్వాత మీ పేరు, వార్డ్ నంబర్ వివరాలు నమోదు చేయండి. వెంటనే మీ వివరాలతో కూడిన ఓటర్ స్లిప్‌ పొందొచ్చు. అలాగే electoralsearch.in జాతీయ ఓటర్ సర్వీస్ పోర్టల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి అందులో మీ వివరాలు నమోదు చేసి సెర్చ్ చేస్తే ఓటర్ కార్డు వివరాలు కనిపిస్తాయి. వీటి నుంచి స్లిప్‌ డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని మీ ఓటు హక్కు ఉపయోగించుకోవచ్చు.

మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారాః

మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా కూడా ఓటర్‌ స్లిప్‌లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం మొబైల్‌లో మై జీహెచ్‌ఎంసీ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని అందులో జీహెచ్‌ఎంసీ ఎలక్షన్స్ 2020 / డౌన్‌లోడ్‌ యువర్‌ ఓటర్‌ స్లిప్‌ పై క్లిక్ చేయాలి. అక్కడ మీ పేరుతో లేదా ఓటర్‌ కార్డ్ నంబర్‌తో సెర్చ్ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి. వాటిని క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేస్తే, ఓటర్‌ స్లిప్‌ డౌన్‌లోడ్ అవుతుంది.

మై జీహెచ్‌ఎంసీ యాప్‌ డౌన్‌లోడ్: • ఆండ్రాయిడ్ • యాపిల్

ఓటర్ కార్డు వివరాలు తెలుసుకునేందుకు ఉన్న మరో అవకాశం జాతీయ ఎన్నికల కమిషన్‌ యాప్‌. మీ మొబైల్‌లో Voter Helpline Appని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో ఎలక్టోరల్ రోల్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మీ వివరాలు టైప్ చేస్తే మీ ఓటర్‌ కార్డ్ వివరాలు కనిపిస్తాయి. యాప్‌ను ఈ కింది లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 పోస్టల్ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగంః

అలాగే దివ్యాగులకు, 80 ఏళ్లు వయస్సు దాటిన వాళ్లకి, కొవిడ్‌ 19 చికిత్స తీసుకుంటున్న వారికి పోస్టల్ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు ఉపయోగించడానికి ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ లింక్‌ క్లిక్‌ చేసి పీడీఎఫ్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.