మేయర్ బరిలో మాజీ ఎమ్మెల్యే కోడలు..? గెలుపుపై గట్టి ధీమా

గ్రేటర్ మేయర్ పీఠం ఈ సారి జనరల్ మహిళకు కేటాయించారు. దీంతో హైదరాబాద్ మహానగర ప్రథమ పౌరురాలిగా ఈ సారి మహిళ కానుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌లో హైదరాబాద్‌కు చెందిన సీనియర్ నేతలు.. మేయర్ పదవి తమవారికే దక్కుతుందని గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

మేయర్ బరిలో మాజీ ఎమ్మెల్యే కోడలు..? గెలుపుపై గట్టి ధీమా


గ్రేటర్ మేయర్ పీఠం ఈ సారి జనరల్ మహిళకు కేటాయించారు. దీంతో హైదరాబాద్ మహానగర ప్రథమ పౌరురాలిగా ఈ సారి మహిళ కానుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌లో హైదరాబాద్‌కు చెందిన సీనియర్ నేతలు.. మేయర్ పదవి తమవారికే దక్కుతుందని గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నారు.  నగరానికి చెందిన ముఖ్య నేతలంతా తమ భార్య లేదా కోడలు వారూ కుదరకపోతే కూతుళ్లను మేయర్ బరిలోకి దింపారు. అదేకోవలో మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి మేయర్ బరిలో నిలిచారు.

మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి (అల్వాల్‌) మేయర్ బరిలో నిలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా మైనంపల్లి హన్మంతరావుకు ఇచ్చారని ఆయన ఒకింత అలకబూనినట్లుగా తెలిసింది. అయితే అప్పటికే కనకారెడ్డి కోడలు విజయశాంతిరెడ్డిని కార్పొరేటర్ గా గెలిపించుకున్న కనకారెడ్డి టికెట్ రాకున్నా.. పార్టీ మారకుండా టీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అసెంబ్లీ టికెట్ ఆపినందున ఈసారి మేయర్ పదవి జనరల్ మహిళగా ఉండటంతో విజయశాంతిని మేయర్ సీటులో కూర్చోబెట్టాలని ప్రయత్నాలు, ప్రచారం గట్టిగానే సాగింది.

ఇకపోతే, మేయర్ పీఠం కోసం పోటీ చేస్తున్న విజయశాంతి నగరంలో గట్టిగానే ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శవంతంగా నిలిచాయని…ప్రజలు, ప్రభుత్వ సహాకారంతో హైదరాబాద్ నగర అభివృద్ధికి కృషిచేస్తానని మాటిచ్చారు.