గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కమిషనర్ దానకిషోర్‌ను విధులనుంచి తప్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఆయనను జలమండలికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్ధానంలో జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్‌గా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేశ్ కుమార్‌ను నియమించింది. ఇక రంగారడ్డి జాయింట్ కలెక్టర్‌గా ఉన్న హరీశ్‌ను అదే జిల్లాకు కలెక్టర్‌గా నియమించింది కేసీఆర్ సర్కార్. దానికిషోర్ జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఏడాది కాలం పాటు సేవలందించారు. ఆయన రెండు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం ఆయనను జలమండలి కమిషనర్‌గా ట్రాన్స్‌ఫర్ చేయడం చర్చనీయాంశంగా మారింది.