జగన్ లక్షణమైన నిర్ణయం: లక్ష్మీ నారాయణ

| Edited By:

Jun 09, 2019 | 11:08 AM

ఏపీలోకి సీబీఐని అనుమతిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై సీబీఐ మాజీ జేడీ, జనసేన అధినేత లక్ష్మీనారాయణ ప్రశంసలు కురిపించారు. ఈ నిర్ణయం శుభపరిణామని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సీబీఐని రాష్ట్రంలోకి రానీయకుండా చేసి గత ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని ఆయన అన్నారు. విశాఖ ప్రజల తనను విశ్వసించారని.. తనను నమ్మి 2లక్షల మంది ఓట్లు వేశారని ఆయన చెప్పుకొచ్చారు.  కాగా వైఎస్ జగన్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్న […]

జగన్ లక్షణమైన నిర్ణయం: లక్ష్మీ నారాయణ
Follow us on

ఏపీలోకి సీబీఐని అనుమతిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై సీబీఐ మాజీ జేడీ, జనసేన అధినేత లక్ష్మీనారాయణ ప్రశంసలు కురిపించారు. ఈ నిర్ణయం శుభపరిణామని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సీబీఐని రాష్ట్రంలోకి రానీయకుండా చేసి గత ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని ఆయన అన్నారు. విశాఖ ప్రజల తనను విశ్వసించారని.. తనను నమ్మి 2లక్షల మంది ఓట్లు వేశారని ఆయన చెప్పుకొచ్చారు.

కాగా వైఎస్ జగన్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్న సమయంలో ఆయన అక్రమాస్తుల కేసును అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ విచారించారు. ఇక ఎన్నికలు ముగిశాక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన లక్ష్మీ నారాయణ.. జగన్‌‌ లక్ష కోట్లు అవినీతి చేశారన్న వార్తలు రాజకీయ ఆరోపణలేనని స్పష్టం చేవారు. తమకు లభించిన ఆధారాల ప్రకారం జగన్‌ రూ.1,366కోట్ల మేరకే అవినీతికి పాల్పడ్డట్లు ఆధారాలు ఉన్నాయని.. దాన్నే తాము చార్జ్‌షీట్‌లో పొందుపరిచామని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.