AP: తిక్కోళ్లా ఏంది..? ట్రాక్టర్ అడ్డుగా ఉందని స్కార్పియోలు వదిలి వెళ్లారు.. అసలు విషయం తెలిస్తే మీరు వెర్రోళ్లవుతారు
స్థానిక గిరిజనులు వెళ్లి చూసేసరికి 2 స్కార్పియోలు రోడ్డుపై నిలిపి ఉన్నాయి. దాంట్లో మనుషులు మాత్రం లేరు. కాసేపు వెయిట్ చేసి చూశారు. చుట్టూ వెతికారు. కానీ ఎవరి జాడ కనిపించలేదు. దీంతో
Andhra Crime News: తగ్గేదే లే అంటున్నారు గంజాయి స్మగ్లర్స్. పోలీసులకు చిక్కుండా ఉండేందుకు దొడ్డి దారులు వెతుక్కుంటున్నారు. తనిఖీలు ఉండని గిరిజన గ్రామాల గుండా మత్తును అక్రమ రవాణా చేసేందుకు యత్నిస్తున్నారు. అలానే ప్రయత్నించిన ఓ ముఠాకు అనుకోని చిక్కొచ్చిపడింది. చెక్‌పోస్ట్ ఉండని ఓ మార్గంలోకి సరుకుతో ఉన్న స్కార్పియోలు మలిపారు. అయితే ఊహించని విధంగా ఆ రూట్‌లో ఓ ట్రాక్టర్ నిలిచిపోయింది. దాన్ని దాటి వెళ్లేందుకు వీలు పడలేదు. ఇటు వెనక్కి వస్తే పోలీసులు పట్టేస్తారు. దీంతో చేసేందేం లేక ఆ వాహనాలు అక్కడే వదిలేసి ఎస్కేప్ అయ్యారు. రోడ్డుపై బండ్లు నిలపి ఉన్నాయి. మనుషులు ఎవరూ లేదు. చుట్టుపక్కల వెతికినా ఎవరూ కనిపించిలేదు. దీంతో స్థానిక గిరిజనులు(Tribes) డోర్లు ఓపెన్ చేసి చూశారు. లోపల ప్యాక్ చేసిన గంజాయి కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా(Alluri Sitharama Raju district) అరుకులోయ(Araku Valley) నియోజకవర్గంలో ఈ ఘటన వెలుగుచూసింది.
గురువారం నైట్ 2 స్కార్పియోలలో సుమారు 1000 కేజీల గంజాయిని తీసుకొని అరకులోయ వైపు నుంచి స్మగ్లర్లు ప్రయాణం ప్రారంభించారు. చిలకలగడ్డ వద్ద ఉన్న చెక్‌పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీలు ఉంటాయి కాబట్టి మరో రూట్ ఎంచుకున్నారు. ఆ దారిలో వెంకయ్యపాలెం గ్రామం సమీపంలో రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్ ఏదో సమస్య వచ్చి ఆగిపోయింది. దీంతో ముందు నుయ్యి.. వెనక గొయ్యిగా మారింది పరిస్థితి. దీంతో చేసేదేం లేక స్కార్పియోలను అక్కడే వదిలి స్మగ్లర్లు ఎస్కేప్ అయ్యారు. ఆ వాహనాలను శుక్రవారం ఉదయం స్టానిక గిరిజనులు గమనించారు. వాటి డోర్లు తెరిచి చేసి చూడగా అందులో భారీ ఎత్తున గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. వారి సమాచారంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ఆ వాహనాలను సీజ్ చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పలు కోణాల్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..