వైఎస్‌ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం అమలుకు సంబంధించిన నిధులను జగన్ సర్కార్ విడుదల చేసింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి రూ.6.05 కోట్ల పాలన అనుమతులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్‌గా వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లు బిగించనున్నారు. ఏపీడీసీఎల్ ద్వారా వ్యవసాయ మీటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు వెచ్చించనుంది. ( కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు ఆత్మహత్య ! )
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకంలో లబ్ధిదారులకు నగదు బదిలీ ప్రారంభించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి అనుగుణంగా జీవో ఎంఎస్ నెం. 22ని ఏపీ ఇంధన శాఖ గతంలో విడుదల చేసింది. వ్యవసాయం విద్యుత్ నగదు బదిలీ పథకం మార్గదర్శకాలు ప్రకటించింది. ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. వినియోగించిన విద్యుత్ యూనిట్ల ప్రకారం రైతుల ఖాతాలోకి నగదు బదిలీ చేస్తారు. దానిని రైతులు నేరుగా విద్యుత్ సరఫరా కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. ( హైదరాబాద్ ప్రజలకు అలెర్ట్: 3 రోజులు బయటకు రావొద్దు )
కానీ, ఉచిత విద్యుత్ పథకంలో ఇలాంటి ప్రయత్నాలపై ప్రతిపక్షాలు నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. లబ్ధిదారులు కూడా పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కోసం ఈ సంస్కరణలు తప్పనిసరి అని ఏపీ సర్కార్ చెబుతోంది. రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా చూస్తామని సీఎం జగన్ హామి ఇచ్చారు.