హైదరాబాద్ ప్రజలకు అలెర్ట్‌: 3 రోజులు బయటకు రావొద్దు

వరద సహాయక చర్యల్లో జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, పోలీస్, రెవిన్యూ, మెట్రో, వాటర్ వర్క్స్ అధికారులు, సిబ్బందిని పూర్తిగా నిమగ్నం చేసి..

హైదరాబాద్ ప్రజలకు అలెర్ట్‌: 3 రోజులు బయటకు రావొద్దు
Follow us

|

Updated on: Oct 14, 2020 | 9:34 AM

వరద సహాయక చర్యల్లో జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, పోలీస్, రెవిన్యూ, మెట్రో, వాటర్ వర్క్స్ అధికారులు, సిబ్బందిని పూర్తిగా నిమగ్నం చేసి.. సమన్వయంతో వ్యవహరించాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ సూచించారు. వరద పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు మేయర్. గత వందేండ్లలో ఎప్పుడూ లేని విధంగా నగరంలో అత్యధిక వర్షపాతం నమోదవుతుందని ఆయన పేర్కొన్నారు.  మరో రెండు, మూడు రోజుల పాటు నగరంలో అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. నగర ప్రజలు 3 రోజుల పాటు ఇండ్లలోనే ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు. ప్రజలకు సహాయక చర్యల విషయంలో అధికారులకు సహకరించాలని కోరారు. వరద ప్రభావిత కాలనీలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ లలోని యువకులు సైనికుల్లా ముందుకువచ్చి అధికారులు, సిబ్బందితో కలిసి వరద సహాయక చర్యల్లో స్వచ్చందంగా భాగస్వాములు కావాలని మేయర్ పిలుపునిచ్చారు. ( Alert : ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ )