Best Health News: చలికాలంలో ఈ పండ్లు తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటా.. అవి ఎంటంటే ?

|

Jan 09, 2021 | 8:49 PM

చలికాలంలో చాలా మందికి అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ కాలంలో తీసుకోవాల్సిన ఆహరంపై సరిగా శ్రద్ద పెట్టారు. చాలా వరకు

Best Health News: చలికాలంలో ఈ పండ్లు తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటా.. అవి ఎంటంటే ?
Follow us on

చలికాలంలో చాలా మందికి అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ కాలంలో తీసుకోవాల్సిన ఆహరంపై సరిగా శ్రద్ద పెట్టారు. చాలా వరకు చలిని తట్టుకుని రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఎంతో ముఖ్యం. ఈ కాలంలో శరీరానికి మేలు చేసే కొన్ని రకాల ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చలికాలంలో ఆకుకూరలు రోజూ తినడం వలన ఆరోగ్యానికి మేలు చేస్తాయట. అంతేకాకుండా ఈ కాలంలో ఇవి తింటే ఆరోగ్యానికి మంచి చేయడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచడానికి తోడ్పతాయి. ఆకుకూరలు రోజూ భోజనంలో తీసుకోవడం ద్వారా ఏ, సీ, కే విటమిన్లు శరీరానికి అందడంతోపాటు ఇందులో ఉండే ఫోలిక్ ఆమ్లం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే నిమ్మజాతి పండ్లను తీసుకోవడం కూడా మంచిదట. ఉదాహరణకు నిమ్మ, బత్తాయి, నారింజ, ద్రాక్ష పండ్లను తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ అందడంమే కాకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటివి దగ్గుతాయి. అలాగే దానిమ్మ పండు గింజలను తినడం వలన శరీరానికి పోషకాలు అందుతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి మేలు చేయడమే కాకుండా, బాడీకి చెడు కొవ్వులు దరిచేరవు. అలాగే గుండెను రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. వీటితోపాటు ఆలుగడ్డ తినడం కూడా చాలా ముఖ్యం. ఇందులో ఉండే ఫైబర్ శరీరానికి మేలు చేయడమే కాకుండా జీర్ణ సంబంధ సమస్యల పరిష్కారానికి ఎంతో తోడ్పడతాయి.

Also Read: చలికాలంలో జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా ?.. అయితే మీ వంటింట్లో ఉండే పదార్థాలతో సులభంగా తగ్గించుకోండిలా..

Health news: రోజు అవిసె గింజలను తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలట.. అవేంటో తెలుసుకుందామా..