AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గూగుల్ క్యాంపస్‌కి తాతను తీసుకెళ్లిన మనవడు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బెంగళూరు టెక్కీ వీడియో!

సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఇంటర్‌నెట్‌ని షేక్‌ చేస్తోంది. నెటిజన్లను కదిలించింది. వైరల్‌ వీడియోలో ఒక యువకుడు తన తాతను మొదటిసారిగా గూగుల్ కార్యాలయ ప్రాంగణాన్ని చూపించడానికి తీసుకువెళ్లాడు. వారిద్దరూ కలిసి గడిపిన క్షణాలు ఒక సినిమాలోని సన్నివేశంలా అనిపించాయి. ఈ వీడియో ఇప్పుడు వేగంగా వైరల్ అవుతోంది.

గూగుల్ క్యాంపస్‌కి తాతను తీసుకెళ్లిన మనవడు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బెంగళూరు టెక్కీ వీడియో!
Grandson Grandfather Bond
Jyothi Gadda
|

Updated on: Apr 27, 2026 | 4:51 PM

Share

ఒక వ్యక్తి విజయం వెనుక ఆ వ్యక్తి కష్టం ఎంత ఉంటుందో, వారిని నమ్మి ప్రోత్సహించే కుటుంబ సభ్యుల పాత్ర కూడా అంతే ఉంటుంది. బెంగళూరుకు చెందిన గూగుల్ టెక్కీ మనీష్ సింగ్ తన విజయానికి మూలమైన తన తాతయ్యకు ఒక అరుదైన బహుమతి ఇచ్చారు. తన తాతయ్యను సంతోషపెట్టిన విధానం నెటిజన్ల మనసు గెలుచుకుంది. చిన్నతనంలో తన తాతయ్య తనకు సైకిల్ తొక్కడం నేర్పించారని, ఇప్పుడు తాతయ్యను సైకిల్‌పై ఎక్కించి తాను సైకిల్ తొక్కడం నేర్పించడం లేదా ఆయనతో కలిసి సైకిల్ తొక్కడం ఒక అద్భుతమైన అనుభూతి అని మనీష్ పేర్కొన్నారు.

బెంగళూరుకు చెందిన మనీష్ సింగ్ గూగుల్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. తన తాతయ్యకు తన పని ప్రదేశాన్ని చూపించాలని మనీష్ ఎప్పటి నుంచో కోరుకున్నారు. ఇటీవల ఆయనను గూగుల్ క్యాంపస్‌కు తీసుకెళ్లి, అక్కడ గూగుల్ సైకిల్‌పై ఆయనను ఎక్కించి తిప్పారు. చిన్నప్పుడు తన తాతయ్య తనకు సైకిల్ తొక్కడం నేర్పిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, ఇప్పుడు అదే సైకిల్‌పై తాతయ్యను చూసి మనీష్ మురిసిపోయారు. వీడియోలో తాతయ్య, మనవడు కలిసి క్యాంపస్‌లోని కేఫెటేరియాలో భోజనం చేయడం, పచ్చని లాన్లలో కబుర్లు చెప్పుకోవడం, పిల్లల్లా కేరింతలు కొట్టడం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

నువ్వు ఏదో ఒక రోజు పెద్ద స్థాయికి చేరుకుంటావు అని తన తాతయ్య చిన్నప్పుడే అనేవారని, నేడు ఆయనను తన ఆఫీసుకు తీసుకెళ్లినప్పుడు ఆయన ముఖంలో కనిపించిన ఆనందం, గర్వం తాను సాధించిన అన్ని విజయాల కంటే గొప్పవని మనీష్ ఆవేదన చెందారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు నిజమైన విజయం అంటే ఇదే అని ప్రశంసిస్తున్నారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన మూలాలను మర్చిపోకూడదు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

నేటి ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో బిజీగా గడిపే యువతకు, ఈ వీడియో ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. మన సక్సెస్‌ను మనల్ని నమ్మిన వారితో పంచుకున్నప్పుడే దానికి పూర్తి సార్థకత లభిస్తుందని మనీష్ సింగ్ నిరూపించారు. వృత్తిపరమైన విజయాల కంటే కుటుంబం ఇచ్చే ప్రోత్సాహం, వారి ముఖంలో కనిపించే గర్వం ఎంతో విలువైనవని అని మనీష్‌ చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us
గోల్డ్ కొనుగోలు చేస్తున్నారా..? ఈ ఒక్క పని చేస్తే మీరు సేఫ్
గోల్డ్ కొనుగోలు చేస్తున్నారా..? ఈ ఒక్క పని చేస్తే మీరు సేఫ్
సాధారణ రవ్వ హల్వాతో బోర్ కొట్టిందా? ఈ క్యారమెల్ ఫ్లేవర్తో పండగే..
సాధారణ రవ్వ హల్వాతో బోర్ కొట్టిందా? ఈ క్యారమెల్ ఫ్లేవర్తో పండగే..
సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందే.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన వైభవ్
సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందే.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన వైభవ్
ఏపీ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్..ఇక ఆర్టీసీ ప్రయాణం మరింత సులభం
ఏపీ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్..ఇక ఆర్టీసీ ప్రయాణం మరింత సులభం
గూగుల్ క్యాంపస్‌కి తాతను తీసుకెళ్లిన టెక్కీ..వీడియో వైరల్
గూగుల్ క్యాంపస్‌కి తాతను తీసుకెళ్లిన టెక్కీ..వీడియో వైరల్
13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
LSG: ఎవర్రా మీరంతా.. లక్షలుపోసి కొంటే నట్టేట ముంచేస్తారా..?
LSG: ఎవర్రా మీరంతా.. లక్షలుపోసి కొంటే నట్టేట ముంచేస్తారా..?
నెలకు ఒక్కసారి ఒక్క గ్లాస్ చాలు.. తులసమ్మ ఎండాకాలంలోనూ గుబురుగా..
నెలకు ఒక్కసారి ఒక్క గ్లాస్ చాలు.. తులసమ్మ ఎండాకాలంలోనూ గుబురుగా..
బద్దకానికే బ్రాండ్ అంబాసిడర్ ఈ జీవి.. రోజుకు 22 గంటల పాటు నిద్ర..
బద్దకానికే బ్రాండ్ అంబాసిడర్ ఈ జీవి.. రోజుకు 22 గంటల పాటు నిద్ర..
ఒక్కడు సినిమా చార్మినార్ సెట్ నిర్మాణం ఎలా చేశారో తెలుసా..?
ఒక్కడు సినిమా చార్మినార్ సెట్ నిర్మాణం ఎలా చేశారో తెలుసా..?