యూరప్‌లో కరోనా మహమ్మారి.. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు మాక్రన్‌‌కు కోవిడ్‌ పాజిటివ్.. స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన ప్రెసిడెంట్

ఏడాది గడుస్తున్న ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. ముఖ్యంగా యూరప్‌లో కొవిడ్ రెండో ద‌ఫా విజృంభణ కొన‌సాగుతూనే ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా ప్రతి ఒక్కసారిని ఈ మహహమ్మారి వదలడం లేదు.

యూరప్‌లో కరోనా మహమ్మారి..  ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు మాక్రన్‌‌కు కోవిడ్‌ పాజిటివ్.. స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన ప్రెసిడెంట్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 17, 2020 | 4:16 PM

ఏడాది గడుస్తున్న ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. ముఖ్యంగా యూరప్‌లో కొవిడ్ రెండో ద‌ఫా విజృంభణ కొన‌సాగుతూనే ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా ప్రతి ఒక్కసారిని ఈ మహహమ్మారి వదలడం లేదు. తాజాగా ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఎమ్మాన్యువెల్ మాక్రన్‌‌కు కోవిడ్‌-19 ప‌రీక్షలు చేయించుకోగా, కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విష‌యాన్ని అధ్యక్ష భ‌వ‌నం ఎలిసీ ప్యాలెస్ ఓ ప్రకట‌న‌లో పేర్కొంది. దీంతో ఆయన వారం రోజులపాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లనున్నట్లు తెలిపారు. అధ్యక్ష భ‌వ‌నం నుంచే ఆయ‌న త‌న బాధ్యత‌ల‌ను నిర్వర్తించ‌నున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. తొలి ల‌క్షణ క‌నిపించ‌గానే.. అధ్యక్షుడు మాక్రన్ వైర‌స్ ప‌రీక్ష చేయించుకున్నట్లు ప్యాలెస్ వ‌ర్గాలు వెల్లడించాయి. మాక్రన్‌కు ఎటువంటి ఇతర ల‌క్షణాలు లేవని, ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అధ్యక్ష భ‌వ‌నం ప్రక‌టించింది. ఆర్‌టీ-పీసీఆర్ ప‌రీక్ష ఆధారంగా మాక్రన్‌కు క‌రోనా వైర‌స్ సంక్రమించిన‌ట్లు గుర్తించారు.