సచివాలయాల ద్వారా ఇకపై పేదలకు ఉచితంగా ఇసుక..

|

Jul 19, 2020 | 1:32 AM

Free Sand Distribution For Poor: ఇసుక పంపిణీ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పేదల ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేయడానికి సిద్దమైంది. ఇసుక కావాల్సిన లబ్దిదారుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో బుక్ చేసుకోగానే.. అధికారులు ఆ దరఖాస్తును పరిశీలించి అనుమతులు మంజూరు చేసి రిజిస్టర్‌లో పేరు నమోదు చేస్తారు. ఇక ఒకవేళ సమీపంలో ఇసుక అందుబాటులో లేకపోతే ఏపీఎండీసీకి చెందిన నిల్వ కేంద్రాలు, డిపోల ద్వారా పేదలకు ఇసుకను […]

సచివాలయాల ద్వారా ఇకపై పేదలకు ఉచితంగా ఇసుక..
Follow us on

Free Sand Distribution For Poor: ఇసుక పంపిణీ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పేదల ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేయడానికి సిద్దమైంది. ఇసుక కావాల్సిన లబ్దిదారుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో బుక్ చేసుకోగానే.. అధికారులు ఆ దరఖాస్తును పరిశీలించి అనుమతులు మంజూరు చేసి రిజిస్టర్‌లో పేరు నమోదు చేస్తారు. ఇక ఒకవేళ సమీపంలో ఇసుక అందుబాటులో లేకపోతే ఏపీఎండీసీకి చెందిన నిల్వ కేంద్రాలు, డిపోల ద్వారా పేదలకు ఇసుకను సరఫరా చేయనున్నారు.

అటు రాష్ట్రంలో అన్ని వర్గాల అవసరాలకు ఇసుక అందివ్వాలన్న ఉద్దేశ్యంలో ఉన్న ఏపీ ప్రభుత్వం పేదలు, ప్రభుత్వ ప్యాకేజీల వంటి పనులకు ఇసుకను రవాణా చేసే ట్రాక్టర్లకు.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా నుంచి మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇసుక మరింత సులభంగా, చౌకగా లభించనుంది.

Also Read:

ఏపీలో పెళ్లిళ్లకు కొత్త మార్గదర్శకాలు.. ఈజీగా అనుమతులు..

వారికి వయోపరిమితి పెంపు.. సీఎం కేసీఆర్ వరాలు..

హైదరాబాద్‌లో మద్యం షాపులు బంద్.. కారణమదే..!

సచివాలయాల్లో ఆధార్ సేవలు.. జగన్ సర్కార్ మరో సంచలనం!

సుశాంత్ ఆత్మతో మాట్లాడిన హుఫ్ పారానార్మల్.. షాకిస్తున్న వీడియో..!

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ .. ఇంటర్‌లో 75% మార్కుల నిబంధన తొలిగింపు..