ఉత్తర ప్రదేశ్‌లో మానవ అస్థి పంజరాల కలకలం.. నలుగురు వ్యక్తులవిగా గుర్తింపు.. దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు

|

Dec 08, 2020 | 1:15 PM

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు మానవ అస్థి పంజరాలు తీవ్ర కలకలం సృష్టించాయి. కాన్పూరు నగరంలోని ఓ కాలనీలో నాలుగు మానవ అస్థి పంజరాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఉత్తర ప్రదేశ్‌లో మానవ అస్థి పంజరాల కలకలం.. నలుగురు వ్యక్తులవిగా గుర్తింపు.. దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు
Follow us on

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు మానవ అస్థి పంజరాలు తీవ్ర కలకలం సృష్టించాయి. కాన్పూరు నగరంలోని ఓ కాలనీలో నాలుగు మానవ అస్థి పంజరాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాన్పూర్ నగరంలోని పంకీ కాలనీలో నాలుగు మానవ అస్థిపంజరాలను పోలీసులు కనుగొన్నారు. కాలనీలో నాలుగు అస్థిపంజరాలు లభించడంతో ప్రజలు కలవరపడ్డారు. అస్థి పంజరాలకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కాన్పూర్ జిల్లా ఎస్పీ అనిల్ కుమార్ చెప్పారు. నలుగురిని ఎవరైనా హతమార్చారా? లేదా వారే ఆత్మహత్య చేసుకున్నారా అనేది దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. అస్థిపంజరాలు చాలా పాతవని, ఇవి వయసు పైబడిన వ్యక్తులవని పోలీసులు అనుమానిస్తున్నారు. మానవ అస్థిపంజరాలను పరీక్ష కోసం తరలించి దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వివరించారు.