ఇంకా విషమంగానే ప్రణబ్‌ ఆరోగ్యం

|

Aug 12, 2020 | 3:14 PM

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. బ్రెయిన్‌ సర్జరీ అనంత‌రం వెటిలేట‌ర్‌పై ఉన్నారు ప్రణబ్‌. ప్రస్తుతం ఇంకా వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు ఆర్మీ ఆస్ప్రత్రి వైద్యులు.

ఇంకా విషమంగానే ప్రణబ్‌ ఆరోగ్యం
Follow us on

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. బ్రెయిన్‌ సర్జరీ అనంత‌రం వెటిలేట‌ర్‌పై ఉన్నారు ప్రణబ్‌. ప్రస్తుతం ఇంకా వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు ఆర్మీ ఆస్ప్రత్రి వైద్యులు. అయితే, తన తండ్రి త్వరగా కోలుకోవాలని కుమార్తె షర్మిష్టా ముఖర్జీ ప్రార్ధించారు. ఈ మేరకు ట్విటర్‌లో తన తండ్రి ఆరోగ్యంపై భావోద్వేగ ట్వీట్‌ చేశారు ఆమె. గతేడాది ఆగస్ట్‌ 8న ఎంతో సంతోషంగా ఉన్నాను. ఆ రోజు నాన్న భారతరత్న అవార్డును అందుకున్నారు. కానీ, సరిగ్గా సంవత్సరానికి అనారోగ్యానికి గురయ్యారని షర్మిష్టా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో దేవుడు ఆయనకు మంచి చేయాలని.. ధైర్యాన్ని, బాధను తట్టుకునే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు. తన తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళ‌న చెందుతున్న‌వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టడంతో ప్రణబ్‌ ముఖర్జీకి సోమవారం ఆపరేషన్‌ చేశారు డాక్టర్లు. అప్పటినుంచి ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదని తెలిపారు. దీంతో ప్రణబ్‌ కోలుకోవాలంటూ పశ్చిమ బెంగాల్‌లోని ప్రణబ్‌ పూర్వీకుల గ్రామంలో..72 గంటలపాటు మహా మృత్యుంజయ యజ్ఞం చేస్తున్నారు. ఈ యజ్ఞం నిరాటంకంగా మూడు రోజుల పాటు కొనసాగ‌నుంది.