AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ మోడల్ సంచలన ఆరోపణలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆరోపణలు-ప్రతి ఆరోపణలతో హీటెక్కాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై.. మాజీ మోడల్ సంచలన ఆరోపణలు చేశారు.

డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ మోడల్ సంచలన ఆరోపణలు
Balaraju Goud
|

Updated on: Sep 17, 2020 | 10:37 PM

Share

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆరోపణలు-ప్రతి ఆరోపణలతో హీటెక్కాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై.. మాజీ మోడల్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుత తరుణంలో ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాఫిక్ గా మారాయి. గతంలో మోడల్‌గా పని చేసిన అమీ డోరిస్ అనే మహిళ.. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో ట్రంప్‌పై ఈ ఆరోపణలు చేశారు. రెండు దశాబ్దాల క్రితం 1997లో న్యూయార్క్‌లో యూఎస్ ఓపెన్ టెన్నీస్ టోర్నమెంట్ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ తనను లైంగికంగా వేధించారని మాజీ మోడల్ అమీ డోరిస్ ఆరోపించారు. టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో వీఐపీ సూట్‌లో ఉన్న ట్రంప్.. తనకు ఊపిరి ఆడనంతగా గట్టిగా పట్టుకున్నారని.. తన శరీరంపై అసభ్యకరంగా తడిమారని పేర్కొన్నారు. అంతేకాకుండా తనకు ట్రంప్ బలవంతంగా ముద్దు కూడా పెట్టారని ఆమె ఆరోపించారు. తన వయసు 24ఏళ్లు ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని ఆమె వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ట్రంప్ వయసు సుమారు 51 సంవత్సరాలు ఉండొచ్చని ఆమె చెప్పుకొచ్చారు. అయితే, ఈ వ్యాఖ్యలను ట్రంప్ తరఫు న్యాయవాదులు ఖండించారు. రాజకీయ దురుద్ధేశ్యంతోనే ఆరోపణలు చేసి ఉంటారని పేర్కొన్నారు.