బెంగాల్‌లో హీటెక్కిన రాజకీయం..గవర్నర్ జగ్దీప్ ధన్‌ఖర్‌తో మాజీ మంత్రి సువేందు అధికారి భేటీ

|

Dec 21, 2020 | 10:27 PM

బెంగాల్‌లో రాజకీయం వేడెక్కుతోంది. కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన తర్వాత కమలం పార్టీలో వలసలు పెరుగుతున్నాయి. ఇటీవల బీజేపీలో చేరిన పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి సువేందు అధికారి గవర్నర్ జగ్దీప్ ధన్‌ఖర్‌తో సమావేశం అయ్యారు.

బెంగాల్‌లో హీటెక్కిన రాజకీయం..గవర్నర్ జగ్దీప్ ధన్‌ఖర్‌తో మాజీ మంత్రి సువేందు అధికారి భేటీ
Follow us on

బెంగాల్‌లో రాజకీయం వేడెక్కుతోంది. కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన తర్వాత కమలం పార్టీలో వలసలు పెరుగుతున్నాయి. ఇటీవల బీజేపీలో చేరిన పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి సువేందు అధికారి గవర్నర్ జగ్దీప్ ధన్‌ఖర్‌తో సమావేశం అయ్యారు.

రాజ్‌భవన్‌లో దాదాపు 30 నిమిషాల పాటు వీరి భేటీ సాగింది. ఎమ్మెల్యే పదవికి సైతం తాను రాజీనామా చేస్తున్నట్టు బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ భీమ్ బంద్యోపాధ్యాయ్‌కి సమాచారం ఇచ్చిన ఈ మాజీ టీఎంసీ దిగ్గజం… తాజాగా గవర్నర్ అధికార నివాసానికి వెళ్లి ఆయనను కలుసుకున్నారు.

అయితే రాజ్‌భవన్ నుంచి నిష్క్రమించేటప్పుడు మాత్రం అక్కడ వేచిచూస్తున్న జర్నలిస్టులతో మాట్లాడకుండానే వెళ్లిపోవడం గమనార్హం. కాగా రాజకీయ ప్రతికారం కారణంగా పోలీసులు తనపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నందున… గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరుతూ ఈ నెల 16న అధికారి లేఖ రాసిన విషయం తెలిసిందే.

సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, మంత్రి పదవికి ఇటీవల రాజీనామా చేసిన ఆయన.. ఈ నెల 19న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు.