కరోనాతో మాజీ ఎలక్షన్ కమిషనర్ మ‌ృతి

కరోనా మహమ్మారి సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు మింగేస్తోంది. ఎప్పుడు ఎవరి వంతు వస్తుందో అని మహారాష్ట్రాలోని ముంబైవాసులు వణికిపోతున్నారు. తాజాగా మాజీ ఐఏఎస్ అధికారిణి, మ‌హారాష్ట్ర మొద‌టి..

కరోనాతో మాజీ ఎలక్షన్ కమిషనర్ మ‌ృతి
Follow us

|

Updated on: Jul 16, 2020 | 10:48 AM

కరోనా మహమ్మారి సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు మింగేస్తోంది. ఎప్పుడు ఎవరి వంతు వస్తుందో అని మహారాష్ట్రాలోని ముంబైవాసులు వణికిపోతున్నారు. తాజాగా మాజీ ఐఏఎస్ అధికారిణి, మ‌హారాష్ట్ర మొద‌టి మ‌హిళా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నీలా స‌త్య‌నారా‌య‌ణ్ క‌రోనాతో మ‌ృతి చెందారు. 72 ఏళ్ల  సత్యనారాయణ్‌ కొన్నిరోజులుగా కొవిడ్‌తో ఇబ్బంది పడుతున్నారు.

శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంటంతో ఆమె ముంబైలోని సెవన్ హిల్స్ ఆస్పత్రిలో చేరారు.  రోజు రోజుకు ఆమె ప‌రిస్థితి విష‌మించ‌డంతో.. ఈ రోజు ఉద‌యం 8 గంట‌ల‌కు మ‌ర‌ణించార‌ని హాస్పిట‌ల్ వర్గాలు తెలిపాయి.

1972 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన నీలా స‌త్య‌నారాయ‌ణ్… 2014, జూలై 5న రిటైర్ అయ్యారు. ప‌ద‌వీ విర‌మ‌ణకు ముందు మ‌హా‌రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌ అధికారిగా పనిచేశారు. తొలి మ‌హిళా క‌మిష‌న‌ర్‌గా రికార్డుల్లోకి ఎక్కారు. ర‌చ‌యిత కూడా నీలా సత్యనారాయణ్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె ప‌ద‌వీ విర‌మణ త‌ర్వాత అనేక పుస్త‌కాలు రాశారు. ప‌లు సినిమాల‌కు కూడా సాహిత్యం కూడా అందించారు. ఆమె రాసిన రౌన్ అనే న‌వ‌ల ఆధారంగా మ‌రాఠీలో సినిమా కూడా రూపొందింది. మొత్తంగా స‌త్య‌నారాయ‌ణ్ 23 పుస్త‌కాలు రాశారు.