Suicide attempt: ”మా దుస్థితికి ప్రధాని మోడీయే కారణం”.. ఫేస్ బుక్ లైవ్ లో విషం తాగిన దంపతులు

ఉత్తర్ ప్రదేశ్ లోని బాగ్ పత్ సుభాష్ నగర్ లో నివాసముండే రాజీవ్ తోమర్ దంపతులు ఫేస్ బుక్ లైవ్ లో విషం తాగి ఆత్మహత్యాయత్నాకి పాల్పడ్డారు. వీరిలో భార్య మృతి చెందగా భర్త పరిస్థితి...

Suicide attempt: మా దుస్థితికి ప్రధాని మోడీయే కారణం.. ఫేస్ బుక్ లైవ్ లో విషం తాగిన దంపతులు
Fb Suicide

Updated on: Feb 10, 2022 | 9:32 AM

ఉత్తర్ ప్రదేశ్ లోని బాగ్ పత్ సుభాష్ నగర్ లో నివాసముండే రాజీవ్ తోమర్ దంపతులు ఫేస్ బుక్ లైవ్(Face book live) లో విషం తాగి ఆత్మహత్యాయత్నాకి పాల్పడ్డారు. వీరిలో భార్య మృతి చెందగా భర్త పరిస్థితి విషమంగా ఉంది. తమ పరిస్థితికి ప్రధానమంత్రి నరేంద్ర(PM Modi) మోడీయే కారణమని విషం తాగే ముందు దంపతులు ఆరోపించారు. ‘‘ నా మరణానికి కారణం ప్రధాని మోడీయే అవుతారు. ఆయనకు చేతనైతే పరిస్థితులను చక్కదిద్దాలి. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ తప్పుబట్టడం లేదు. రైతులు, చిన్న వ్యాపారులకు ఆయన హితుడు కాదు’’ అని వీడియోలో పేర్కొన్నారు. రాజీవ్‌ విషం తీసుకుంటుండగా అతడి భార్య పూనం అడ్డుకున్నారు. వద్దని వారించారు. దీంతో భావోద్వేగానికి లోనైన రాజీవ్‌.. ‘‘ప్రభుత్వం మన మాట వినడం లేదు. కనీసం నువ్వయినా విను’’ అంటూ విషం తాగించారు. దీంతో పూనం కూడా విషం తాగారు. అనంతరం ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే పూనం మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. రాజీవ్‌ పరిస్థితి విషమంగా ఉందని ఎస్పీ నీరజ్‌ కుమార్‌ జాదౌన్‌ తెలిపారు.

2020లో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా రాజీవ్‌ వ్యాపారం దారుణంగా దెబ్బతిందని, అతని దుకాణంలోని బూట్లలో చాలా మటుకు పాడైపోయాయని కుటుంబసభ్యులు తెలిపారు. రాజీవ్‌ భార్య మృతిపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా విచారం వ్యక్తం చేశారు.

 

ఇవీ చదవండి.

Vijayawada crime: కీచక గురువు.. స్నేహితుడని నమ్మి.. బాధలు చెప్పుకున్న టీచర్ పై..

Mandya Murders: సోదరి భర్తపై ఇష్టంతో.. ఐదుగురిని చంపేసింది.. ఆఖరుకు..?

Viral: వామ్మో! ఆమెకు ఇదేం వింత కోరిక.. నెలకోసారి గర్భం దాల్చుతుందట.!