ఆహారాన్ని వడ్డించే రోబోలు వచ్చేసాయి.. ‘ఫ్లంకీ’గా నామకరణం‌.. ఎక్కడున్నాయో తెలుసా..

|

Jan 12, 2021 | 12:05 PM

ప్రస్తుత కాలంలో అన్ని రంగాల్లోకి రోబోలు వచ్చేస్తున్నాయి. తాజాగా హోటళ్లు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, బ్యాంకులు, రిటైల్ వ్యాపార సంస్థల్లోకి కూడా రోబోల వాడకం మొదలైంది.

ఆహారాన్ని వడ్డించే రోబోలు వచ్చేసాయి.. ఫ్లంకీగా నామకరణం‌.. ఎక్కడున్నాయో తెలుసా..
Follow us on

ప్రస్తుత కాలంలో అన్ని రంగాల్లోకి రోబోలు వచ్చేస్తున్నాయి. తాజాగా హోటళ్లు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, బ్యాంకులు, రిటైల్ వ్యాపార సంస్థల్లోకి కూడా రోబోల వాడకం మొదలైంది. వీటికి సంబంధించిన రోబోలను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్నట్లు విస్టాన్ నెక్ట్స్‏జెన్ తెలిపింది. హైదరాబాద్‏కు చెందిన విస్టాన్ నెక్ట్స్‏జెన్ అంకురం సంస్థ ఇప్పటికే 70 రోబోలను తయారు చేసింది. త్వరలోనే పలు సంస్థలకు అందించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు రామరాజు సింగం సోమవారం వెల్లడించారు. అయితే ఇప్పటికే కొన్ని రోబోలను తిరుపతిలోని ఒక హోటల్‏కు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఆరోగ్య సంరక్షణ రంగంలోకి సుశ్రుత్, నైటింగేల్, శానిటైజేషన్‏కు ఫ్లంకీ ఆటోప్యూర్ రోబో, అలాగే రోగులకు ఔషదాలను, ఆహార పదార్థాలను అందించేందుకు ఫ్లంకీ కొవిడ్ 19 స్టివార్ట్ సహాయపడుతుంది. హోటళ్లలో తినేవాటిని ఎంపిక చేసుకోవడంలో సహాయపడుతుంది. అలాగే బిల్లులు తీసుకోవడం, ఆహారాన్ని టేబుళ్ళ మీదకు తీసుకురావడం లాంటి పనులు చేయడానికి వీటిని తయారు చేశారు. బ్యాంకింగ్ అసిస్టెంట్, విద్యార్థుల కోసం వజ్ర ఆచార్య రోబోలను తీసుకొచ్చినట్లు రామరాజు తెలిపారు. జూన్ నాటికి హ్యూమనాయిడ్ రోబో మొదటి వెర్షన్ తీసుకొస్తామని తెలిపారు. అలాగే వ్యవసాయ రంగానికి ప్రత్యేక బాట్లనూ అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

Also Read: