వాట్సాప్ మెసేజ్‌తో.. ఫ్లైట్ టికెట్ బుకింగ్.!

Easy My Trip And Whatsapp Collaboration: విమాన ప్రయాణం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకో అదిరిపోయే న్యూస్. ఇకపై ఫ్లైట్ టిక్కెట్ల కోసం ఆన్‌లైన్ ట్రావెల్ యాప్స్‌ను వెతకాల్సిన అవసరం లేదు. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ద్వారానే విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. దేశీయ ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ ఈజీ మై ట్రిప్.. వాట్సాప్‌తో అనుసంధానం అయ్యి.. ఈ సదుపాయాన్ని నూతనంగా ప్రారంభించింది. ఈ నెల 22వ తేదీన సదరు సంస్థ ఈ మేరకు […]

వాట్సాప్ మెసేజ్‌తో.. ఫ్లైట్ టికెట్ బుకింగ్.!
Follow us

|

Updated on: Jan 26, 2020 | 1:39 PM

Easy My Trip And Whatsapp Collaboration: విమాన ప్రయాణం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకో అదిరిపోయే న్యూస్. ఇకపై ఫ్లైట్ టిక్కెట్ల కోసం ఆన్‌లైన్ ట్రావెల్ యాప్స్‌ను వెతకాల్సిన అవసరం లేదు. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ద్వారానే విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. దేశీయ ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ ఈజీ మై ట్రిప్.. వాట్సాప్‌తో అనుసంధానం అయ్యి.. ఈ సదుపాయాన్ని నూతనంగా ప్రారంభించింది. ఈ నెల 22వ తేదీన సదరు సంస్థ ఈ మేరకు ఓ ప్రకటన వెల్లడించింది.

కస్టమర్ సెట్రిక్ విధానంలో భాగంగా తమ సంస్థ నెంబర్‌కు వెళ్లాల్సిన ప్లేస్‌ను కస్టమర్ మెసేజ్ చేస్తే చాలని.. తామే టికెట్ బుక్ చేస్తామని చెప్పింది. దీని ద్వారా కస్టమర్లు టిక్కెట్ల కోసం ఆన్లైన్, వివిధ రకాల యాప్స్‌లో ప్రయత్నించాల్సిన అవసరం లేదని.. ఒక్క మెసేజ్ ద్వారా వాట్సాప్ నుంచే అతి తక్కువ ధరకు టిక్కెట్లను పొందవచ్చునని తెలిపింది. అంతేకాకుండా టిక్కెట్ల రేట్ల లిస్ట్.. ఆఫర్ల వివరాలు కూడా కస్టమర్లకు ఎప్పటికప్పుడు మెసేజ్ ద్వారా పంపిస్తుంటామని ఆ సంస్థ అధికారి ఒకరు తెలిపారు. లేట్ ఎందుకు అదేంటో ఒకసారి మీరు కూడా చూడండి.