బెజవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ వర్గాల మధ్య ఫ్లెక్సీ వార్..దేవినేని అవినాష్ ఉన్న బ్యానర్స్‌ చించివేత

బెజవాడ వైసీపీలో ఫ్లెక్సీల రగడ నెలకుంది. తూర్పు నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య కోల్డ్ వార్ కాస్తా..ఇప్పుడు ప్లెక్సీలు చించుకునేవరకు వచ్చింది.

బెజవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ వర్గాల మధ్య ఫ్లెక్సీ వార్..దేవినేని అవినాష్ ఉన్న బ్యానర్స్‌ చించివేత

Updated on: Dec 20, 2020 | 1:05 PM

బెజవాడ వైసీపీలో ఫ్లెక్సీల రగడ నెలకుంది. తూర్పు నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య కోల్డ్ వార్ కాస్తా..ఇప్పుడు ప్లెక్సీలు చించుకునేవరకు వచ్చింది. వైస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ బర్త్ డే నేపథ్యంలో వైసీపీలోని రెండు గ్రూపులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. అయితే తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ ఫోటో ఉన్న ఫ్లెక్సీలపై పేడ కొట్టి, చించివేయడంతో తీవ్ర ఉద్రిక్తకు నెలకుంది. 21వ డివిజన్ కార్పేరేటర్ అభ్యర్థిగా పుప్పాల కుమారిని దేవినేని అవినాష్ ఫైనల్ చెయ్యడంతో..అది నచ్చక మరో వర్గం ఈ చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. వివాదం ముదిరి ఘర్షణకు దారితీయటంతో పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసులు రాజీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుతోంది.

Also Read :

Tirumala Tirupati : శ్రీవారి సర్వ దర్శనం టోకెన్ల జారీ వివాదం..భక్తుల ఆందోళన..స్పందించిన టీటీడీ

Road Accident : తూర్పు గోదావరి జిల్లాలో విషాదం..రోడ్డు ప్రమాదంలో తండ్రి కళ్లెదుటే ఇద్దరు చిన్నారులు మృతి