భారత్‌లోకి అక్రమంగా వచ్చిన.. మాల్దీవుల మాజీ ప్రెసిడెంట్ అరెస్ట్..

| Edited By:

Aug 02, 2019 | 7:46 AM

అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారంటూ.. మాల్దీవుల మాజీ ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్ అబ్దుల్ గఫూర్‌ను ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. టగ్ బోట్ వర్గో-9లో అహ్మద్‌ అదీబ్‌ తమిళనాడులోని ట్యూటికోరన్‌ ఓడరేవు ద్వారా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో ఆయనను ఆరెస్ట్ చేసినట్లు ఐబీ వర్గాలు పేర్కొన్నాయి. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా ఆయన భారత్‌కు వచ్చారని.. అక్రమంగా భారత్‌లోకి వచ్చే అవసరం ఏముందని.. ఈ విషయం పై దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఐటీ అధికారులు తెలిపారు. ఇంటెలిజెన్స్ […]

భారత్‌లోకి అక్రమంగా వచ్చిన.. మాల్దీవుల మాజీ ప్రెసిడెంట్ అరెస్ట్..
Follow us on

అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారంటూ.. మాల్దీవుల మాజీ ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్ అబ్దుల్ గఫూర్‌ను ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. టగ్ బోట్ వర్గో-9లో అహ్మద్‌ అదీబ్‌ తమిళనాడులోని ట్యూటికోరన్‌ ఓడరేవు ద్వారా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో ఆయనను ఆరెస్ట్ చేసినట్లు ఐబీ వర్గాలు పేర్కొన్నాయి. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా ఆయన భారత్‌కు వచ్చారని.. అక్రమంగా భారత్‌లోకి వచ్చే అవసరం ఏముందని.. ఈ విషయం పై దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఐటీ అధికారులు తెలిపారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఇప్పటికే అహ్మద్ అదీబ్ అరెస్టు విషయంపై కేంద్ర విదేశాంగ శాఖకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. టగ్ బోట్ జులై 11న మాల్దీవులకు బయలుదేరినపుడు 9 మంది క్రూ సిబ్బంది ఉన్నారు. వీరిలో 8 మంది ఇండోనేషియన్లు కాగా.. బోస్కో అనే భారతీయుడు కూడా ఉన్నారు. అయితే మాల్దీవుల నుంచి టగ్ బోట్ జులై 27న తిరుగుపయనమవగా… బోటులో ఓ కొత్త వ్యక్తి ఉన్నారని టగ్ బోట్ ఏజెంట్ మాకు సమాచారమందించారని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.