దేవునిపల్లి గ్రామంలో విషాదఛాయలు, అదృశ్యమైన బాలుడు నిశాంత్ ఇంటి ముందు మురుగు కాల్వలో విగతజీవిగా తేలిన వైనం

|

Jan 15, 2021 | 10:06 AM

కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. అదృశ్యమైన నిశాంత్ అనే ఐదేళ్ల బాలుడు విగతజీవిగా మారాడు...

దేవునిపల్లి గ్రామంలో విషాదఛాయలు, అదృశ్యమైన బాలుడు నిశాంత్ ఇంటి ముందు మురుగు కాల్వలో విగతజీవిగా తేలిన వైనం
Follow us on

కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. అదృశ్యమైన నిశాంత్ అనే ఐదేళ్ల బాలుడు విగతజీవిగా మారాడు. ఇంటి ముందు మురుగుకాల్వలో శవమై తేలాడు. నిన్న మధ్యాహ్నం పతంగులు ఆడుకుంటూ నిశాంత్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు అనేక చోట్ల వెతికి దొరక్కపోవడంతో చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, రాత్రి ఇంటి ముందు ఉన్న మురుగు కాల్వలో నిశాంత్ మృతదేహం కనిపించింది. నిశాంత్ మృతదేహంను చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు.