Sircilla: పిట్ట కొంచెం.. ప్రతిభ ఘనం.. ఐదు నెలలకే తెలుగు బుక్ అఫ్ వరల్డ్ రికార్డు!

పువ్వు పుట్టగానే పరమలిస్తుందన్న నానుడి ఆ చిన్నారికి అక్షరాలా సరిపోతుంది. కేవలం ఐదు నెలల వయసులోనే అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తూ అందరి నోట ఔరా అనిపిస్తోంది. అమ్మ అని పలకడం కూడా రాని చిట్టి వయసులో 70కి పైగా వస్తువులను గుర్తించి అందరి ప్రశంసలు అందుకోవడమే గాక

Sircilla: పిట్ట కొంచెం.. ప్రతిభ ఘనం.. ఐదు నెలలకే తెలుగు బుక్ అఫ్ వరల్డ్ రికార్డు!
Record

Edited By: Balu Jajala

Updated on: Feb 25, 2024 | 2:03 PM

పువ్వు పుట్టగానే పరమళిస్తుందన్న నానుడి ఆ చిన్నారికి అక్షరాలా సరిపోతుంది. కేవలం ఐదు నెలల వయసులోనే అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తూ అందరి నోట ఔరా అనిపిస్తోంది. అమ్మ అని పలకడం కూడా రాని చిట్టి వయసులో 70కి పైగా వస్తువులను గుర్తించి అందరి ప్రశంసలు అందుకోవడమే గాక, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లు చోటు కూడా సంపాదించింది ఆ చిన్నారి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన వేముల సాగర్-సౌమ్య ల కూతురు సంవేద్యకి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించింది.

అమ్మానాన్నలను గుర్తించడమే కష్టమైన వయసులో 70కి పైగా కేటగిరీలలో వస్తువులను గుర్తించడం ద్వారా సంవేద్య తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులను ఆకట్టుకుంది. చిన్నారి ప్రతిభకు అబ్బురపడిన ప్రతినిధులు బంగారు పతకంతో సన్మానించడమే కాకుండా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేశారు. పాప రంగులను గుర్తించడం చూసి వివిధ రకాల కేటగిరీలో వస్తువులను చూపించడం ద్వారా వాటిని గుర్తించేలా ప్రాక్టీస్ చేయించామని తల్లిదండ్రులు తెలిపారు. తమ చిన్నారి పేరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు కావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.