శ్రీరామ్ ఆలాపనతో.. “సామజవరగమన” మరో చాట్ బస్టర్

| Edited By: Anil kumar poka

Sep 29, 2019 | 4:14 PM

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, పూజా హెగ్డే జోడీగా వస్తున్న “అలవైకుంఠపురంలో”ని తొలి మెలోడీ అయిన “సామజవరగమన” వీడియో సాంగ్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. దువ్వాడ జగన్నాథం మూవీలో జంటగా నటించిన వీరిద్దరూ హిట్ పెయిర్ అనిపించుకున్నారు. డీజే మూవీలో కూడా గుడిలో బడిలో అనే మెలోడీ సాంగ్‌తో వారు ప్రేక్షకులను అలరించారు. తాజాగా “అలవైకుంఠపురంలో” సినిమాతో మరోసారి హిట్ కొట్టేందుకు రెడీ అయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీకి ఎస్.ఎస్ తమన్ సంగీతం […]

శ్రీరామ్ ఆలాపనతో.. సామజవరగమన మరో చాట్ బస్టర్
Follow us on

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, పూజా హెగ్డే జోడీగా వస్తున్న “అలవైకుంఠపురంలో”ని తొలి మెలోడీ అయిన “సామజవరగమన” వీడియో సాంగ్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. దువ్వాడ జగన్నాథం మూవీలో జంటగా నటించిన వీరిద్దరూ హిట్ పెయిర్ అనిపించుకున్నారు. డీజే మూవీలో కూడా గుడిలో బడిలో అనే మెలోడీ సాంగ్‌తో వారు ప్రేక్షకులను అలరించారు. తాజాగా “అలవైకుంఠపురంలో” సినిమాతో మరోసారి హిట్ కొట్టేందుకు రెడీ అయ్యారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించారు. “ఉండిపోరాదే” సాంగ్ తో ఫేమస్ అయిన సీద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. వీడియోలో తమన్ పియానో వాయిస్తూ.. శ్రీరామ్ పాటను ఆలపిస్తూ కనిపించారు. “నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు.. ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు”.. అసలు అంటూ సాగుతున్న ఈ పాట ఎంతో వినసొంపుగా సాగింది. ఈ పాటకు ప్రముఖ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. ఇక ఈ చిత్రంలో టబు, నివేదా పేతురాజ్, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, సుశాంత్, వెన్నెల కిశోర్, సునీల్, బ్రహ్మాజీ, మురళీ శర్మ, హర్ష వర్ధన్, సచిన్ ఖెడేకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. అందుకే ఇప్పటినుంచే ఈ సినిమాకి ఫుల్‌గా బజ్ పెంచే పనిలో చిత్రబృందం బిజీగా ఉంది. ఫ్యామిలీ ఎంటర్ టైన్‌మెంట్‌గా ఈ మూవీ తెరకెక్కనుంది.