చంద్రయాన్-2 ఫస్ట్ ఇమేజెస్ ..సారీ..ఫేక్ ప్లీజ్ !

ఈ నెల 22 న నింగిలోకి ఎగసిన చంద్రయాన్-2 శాటిలైట్ ఫస్ట్ ఇమేజీలను పంపిందని, అవే ఇవి అంటూ సోషల్ మీడియాలో పలు ఫోటోలు వెల్లువెత్తాయి. అంతరిక్షం నుంచి భూమి ఇలా కనిపిస్తోందని, చంద్రయాన్-2 వీటిని పంపిందని ఒకటే వార్తలు ! అయితే ఓ మ్యాగజైన్ ఆధ్వర్యంలోని యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్.. ఇవి నిజం కావని తేల్చింది. ఇప్పటివరకు చంద్రయాన్-2 ఎలాంటి ఫొటోలూ పంపలేదని స్పష్టమైంది. ప్రియవ్రత దాస్ గుప్తా అనే ఫేస్ బుక్ […]

చంద్రయాన్-2 ఫస్ట్ ఇమేజెస్ ..సారీ..ఫేక్ ప్లీజ్ !
Anil kumar poka

|

Jul 28, 2019 | 12:28 PM

ఈ నెల 22 న నింగిలోకి ఎగసిన చంద్రయాన్-2 శాటిలైట్ ఫస్ట్ ఇమేజీలను పంపిందని, అవే ఇవి అంటూ సోషల్ మీడియాలో పలు ఫోటోలు వెల్లువెత్తాయి. అంతరిక్షం నుంచి భూమి ఇలా కనిపిస్తోందని, చంద్రయాన్-2 వీటిని పంపిందని ఒకటే వార్తలు ! అయితే ఓ మ్యాగజైన్ ఆధ్వర్యంలోని యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్.. ఇవి నిజం కావని తేల్చింది. ఇప్పటివరకు చంద్రయాన్-2 ఎలాంటి ఫొటోలూ పంపలేదని స్పష్టమైంది. ప్రియవ్రత దాస్ గుప్తా అనే ఫేస్ బుక్ యూజర్… భూతల ఫోటోలను పంపుతూ.. చంద్రయాన్-2 పంపిన ఈ ఇమేజీలు అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇవి ఫేస్ బుక్, ట్విటర్లలో అదే పనిగా షేరవుతున్నాయి. ఈ నెల 26 న చంద్రయాన్-2 రెండో భూకక్ష్యలో మరో పరిభ్రమణాన్నీ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ శాటిలైట్ లోని రోవర్ సెప్టెంబర్ 7 న చంద్రుని సౌత్ పోల్ ని తాకనుంది . అయితే ఇది అంతరిక్షంలో భూమికి సంబంధించిన ఫోటోలను తీయదని అంటున్నారు.

నిజానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోల్లో ఒకటి.. నాడు రష్యా ప్రయోగించిన అంతరిక్షనౌకలో ప్రయాణించిన వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి పంపిన ఇమేజీ. కురిల్ దీవుల్లోని శారిచెవ్ అనే అగ్నిపర్వతం బద్దలైనప్పుడు దాని నుంచి వెలువడిన దుమ్ము, ధూళి, పొగలు, ఆవిరి, బూడిద తాలూకుది ఇది. మరొకటి.. ‘ ఫ్లైట్ ఓవర్ ది మార్కింగ్ ఎర్త్ ‘ పేరిట షటర్ స్టాక్ పై పోస్ట్ చేసిన యానిమేటెడ్ వీడియో ఇమేజ్.. 2014 నుంచి పలు వెబ్ సైట్లు, సోషల్ మీడియా ఇంటర్నెట్లో వినియోగించిన ఇమేజీలు కూడా వీటిలో ఉన్నాయి. 2007 మార్చిలో నాసా వెబ్ సైట్ పోస్ట్ చేసిన మరో ఫోటోతో బాటు మరిన్నిఇమేజీలను పలువురు షేర్ చేస్తూ ఇవి చంద్రయాన్-2 పంపినవే అంటూ ‘ బురిడీ ‘ కొట్టిస్తున్నట్టు ఈ పరిశీలనలో వెల్లడైంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu