తెలంగాణలో తొలి విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మూడు దశల పోలింగ్‌లో భాగంగా.. తొలిదశలో 2,097 ఎంపీటీసీలకు, 195 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. అలానే.. పోలింగ్ సిబ్బంది పంచాయతీ ఎన్నికల్లో చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా తగు చర్యలు చేపట్టారు. ఎండలు మండిపోతుండడంతో ఉదయాన్నే ఓటు వేసేందుకు ఓటర్లు మొగ్గుచూపుతున్నారు.