First flight : అమెరికాలోని చికాగో అంతర్జాతీయ విమానాశ్రయం నుండి హైద్రాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంకు డైరెక్ట్ ఫ్లైట్ ఈ తెల్లవారుజామున సేఫ్ గా ల్యాండ్ అయింది. అర్థరాత్రి దాటిన తర్వాత 12.20 నిమిషాలకు విమానం హైదరాబాద్ చేరుకుంది. అమెరికా టు హైదరాబాద్ ఫస్ట్ డైరెక్ట్ ఫ్లైట్ సేఫ్ గా ల్యాండ్ కావడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. విమానం నడిపిన నలుగురు పైలెట్స్ ను శంషాబాద్ విమానాశ్రయం లో ఘనంగా సన్మానించారు. జర్నీ చాలా హ్యాపీగా జరిగిందని ప్రయాణీకులు సైతం తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 238 సీట్ల సామర్యం కలిగిన ఈ విమానంలో 8 ఫస్ట్ క్లాస్, 35 బిజినెస్ క్లాస్, 195 ఎకానమీ సీట్ల తో పాటు నలుగురు కాక్ పిట్, 12 మంది క్యాబిన్ క్రీవ్ సిబ్బంది ప్రయాణించారు.