
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. రైలు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం ట్రైన్ సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూరు సమీపంలోని నవాంద్గి స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ట్రైన్‌ను నిలిపివేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.