బహీఖాతాతో నిర్మల.. ఇక సూట్‌కేసు సంప్రదాయానికి స్వస్తి..!

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త సంప్రదాయానికి తెరలేపారు. ఈ సారి బడ్జెట్ పత్రాల బ్రీఫ్ కే‌స్ మార్చారు నిర్మల. గోధుమ వర్ణ సూట్‌కేస్ స్థానంలో ఎర్రటి పార్శిల్ లాంటి జ్యూట్ బ్యాగ్ తీసుకురావడం ద్వారా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారామె. సాధారణంగా గత ఆర్థిక మంత్రులు బడ్జెట్ పత్రాలను గోధుమ వర్ణ సూట్‌కేస్‌లో పార్లమెంట్‌కు తీసుకెళ్లేవారు. అయితే.. ఈసారి ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి పార్లమెంట్‌కు బయల్దేరిన నిర్మలా సీతారామన్ చేతిలో బ్రీఫ్ కేసు కాకుండా […]

బహీఖాతాతో నిర్మల.. ఇక సూట్‌కేసు సంప్రదాయానికి స్వస్తి..!

Edited By:

Updated on: Jul 05, 2019 | 2:08 PM

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త సంప్రదాయానికి తెరలేపారు. ఈ సారి బడ్జెట్ పత్రాల బ్రీఫ్ కే‌స్ మార్చారు నిర్మల. గోధుమ వర్ణ సూట్‌కేస్ స్థానంలో ఎర్రటి పార్శిల్ లాంటి జ్యూట్ బ్యాగ్ తీసుకురావడం ద్వారా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారామె.

సాధారణంగా గత ఆర్థిక మంత్రులు బడ్జెట్ పత్రాలను గోధుమ వర్ణ సూట్‌కేస్‌లో పార్లమెంట్‌కు తీసుకెళ్లేవారు. అయితే.. ఈసారి ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి పార్లమెంట్‌కు బయల్దేరిన నిర్మలా సీతారామన్ చేతిలో బ్రీఫ్ కేసు కాకుండా ఎర్రటి వస్త్రంతో చుట్టిన పార్శిల్ లాంటి జ్యూట్ బ్యాంగ్ కనిపించింది. దానిపై రాజముద్ర కూడా ఉంది. సంప్రదాయాన్ని పక్కన బెట్టి ఎర్రటి జ్యూట్ బ్యాగ్‌లో బడ్జెట్ పత్రాలు తీసుకొచ్చారు నిర్మలా సీతారామన్.