February Bank Holiday: ఫిబ్రవరిలో బ్యాంకు హాలీడేస్ ఎన్ని రోజులో తెలుసా?
February 2026 Bank Holiday: ఫిబ్రవరిలో బ్యాంకులకు భారీగా సెలవులు వస్తున్నాయి. ఈ సెలవు దినాలలో చెక్ క్లియరెన్స్, డ్రాఫ్ట్‌లు, లాకర్ సంబంధిత పనులు, బ్రాంచ్ కౌంటర్ లావాదేవీలు సాధ్యం కావు. ముఖ్యంగా మహాశివరాత్రి, ఇతర స్థానిక సెలవులు పాటించే రాష్ట్రాల్లో..

February 2026 Bank Holiday: ఈ ఏడాది జనవరి నెల ముగియబోతోంది. ఫిబ్రవరి నెల ప్రారంభం కానుంది. ప్రతి నెల రాగానే బ్యాంకుల సెలవుల జాబితా గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు చాలా మంది. 2026లో ఏదైనా ముఖ్యమైన బ్యాంకు సంబంధిత పనిని ప్లాన్ చేస్తుంటే ఈ వార్త ఉపయోగకరంగా ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరి నెలకు సంబంధించిన అధికారిక బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కొన్ని రాష్ట్రాల్లో వారపు సెలవులు, రెండవ, నాల్గవ శనివారాలు, అలాగే పండుగలు, ప్రత్యేక రోజులు ఉన్నాయి.
ఫిబ్రవరి 2026 లో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకు శాఖలు మూసివేసే అనేక రోజులు ఉన్నాయి. వీటిలో ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ తేదీలలో బ్యాంకు శాఖలు మూసి ఉండనున్నాయి.
Auto News: ఈ బైక్ ధర కేవలం రూ.74 వేలే.. మైలేజీ 70 కి.మీ.. మార్కెట్‌ను షేక్ చేస్తున్న బైక్!
- ఫిబ్రవరి 1 (ఆదివారం): వారపు సెలవు
- ఫిబ్రవరి 14 (శనివారం): రెండవ శనివారం
- ఫిబ్రవరి 15 (ఆదివారం): వారపు సెలవు
- ఫిబ్రవరి 22 (ఆదివారం): వారపు సెలవు
- ఫిబ్రవరి 28 (శనివారం): నాల్గవ శనివారం
రాష్ట్రాల్లో పండుగల కారణంగా అదనపు సెలవులు
ఫిబ్రవరిలో మహాశివరాత్రి (ఫిబ్రవరి 15) సందర్భంగా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ సెలవుదినం ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీతో సహా దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తిస్తుంది. అదనంగా స్థానిక పండుగలు, ప్రత్యేక సందర్భాలలో కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు కూడా మూసి ఉంటాయి.
- ఫిబ్రవరి 18: సిక్కింలోని లోసర్ అక్కడ బ్యాంకులకు సెలవు.
- ఫిబ్రవరి 19: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి
- ఫిబ్రవరి 20: అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలలో రాష్ట్ర అవతరణ దినోత్సవం
బ్యాంకు మూసివేసినప్పుడు ఏ సేవలు అందుబాటులో ఉంటాయి?
బ్యాంకు శాఖ మూసివేసినప్పటికీ కస్టమర్లకు ఎటువంటి పెద్ద అసౌకర్యం ఉండదు. UPI, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు యధావిధిగా పనిచేస్తాయి. ATM నుండి నగదు తీసుకునే సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.
అయితే ఈ సెలవు దినాలలో చెక్ క్లియరెన్స్, డ్రాఫ్ట్‌లు, లాకర్ సంబంధిత పనులు, బ్రాంచ్ కౌంటర్ లావాదేవీలు సాధ్యం కావు. ముఖ్యంగా మహాశివరాత్రి, ఇతర స్థానిక సెలవులు పాటించే రాష్ట్రాల్లో ఫిబ్రవరి రెండవ వారానికి ముందు తమ ముఖ్యమైన బ్యాంకింగ్ పనులను పూర్తి చేయాలని RBI, బ్యాంకులు కస్టమర్లను కోరుతున్నాయి. శివరాత్రి ఫిబ్రవరి 15, ఆదివారం నాడు వస్తుంది.
ఇది కూడా చదవండి: IBM: 15 ఏళ్లుగా సెలవులో ఉన్న ఉద్యోగి.. జీతం పెంచడం లేదని కంపెనీపై దావా.. విచిత్రమైన కేసు గురించి తెలిస్తే మైండ్ బ్లాంక్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




