Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కాటేశాడు.. అన్నంలో నిద్ర మాత్రలు కలిపి మరీ..

Hyderabad: హైదారబాద్‌లోని బంజారాహిల్స్‌లో దారుణం వెలుగు చూసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి.. కామంతో కన్నకూతురునే..

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కాటేశాడు.. అన్నంలో నిద్ర మాత్రలు కలిపి మరీ..
Harassment
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 20, 2021 | 11:16 AM

Hyderabad: హైదారబాద్‌లోని బంజారాహిల్స్‌లో దారుణం వెలుగు చూసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి.. కామంతో కన్నకూతురునే కాటేశాడు. తినే అన్నంలో నిద్ర మాత్రలు కలిపి.. ఆపై ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు నీచుడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చింది. భార్య, భర్తలు ఇద్దరూ చెరో పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె(16), కొడుకు(14) ఉన్నారు. అయితే, సొంతూరిలో చదువును మానేసిన బాలిక.. తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఇక్కడే వారితో ఉంటోంది. అయితే, కామంతో కన్నూమిన్నూ కానని ఆ నీచుడు.. కన్న కూతురుపైనే కన్నేశాడు.

ఈ క్రమంలో భార్య ఇళ్లలో పనికి వెళ్లగానే.. కూతురుని అన్నంలో నిద్రమాత్రలు కలిపి వడ్డించేవాడు. అలా ఆ బాలిక మత్తులోకి జారుకోగానే.. ఈ నీచుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఇలా అనేకసార్లు జరుగగా.. నిద్రమత్తులో ఉన్న బాలికకు అదే తెలిసేది కాదు. ఇటీవల నేరుగానే ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ కీచకుడు. ఎవరికైనా చెబితే.. చంపేస్తానని బెదిరించేవాడు. అయితే, తాజాగా బాలిక గర్భవతి అని తేలడంతో.. ఆమె తల్లి నిలదీసింది. దాంతో జరిగిన విషయాన్ని బోరున విలపిస్తూ తల్లికి వివరించింది బాలిక. భర్త చేసిన పనికి రగిలిపోయిన ఆ తల్లి.. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలుసుకున్న నిందితుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Also read:

India Vs Srilanka: వన్డే సిరీస్‌పై కన్నేసిన గబ్బర్ సేన.. టీంలో నో ఛేంజ్‌స్.. ఆ ఇద్దరూ బెంచ్‌కే!

Raj Kundra: రాజ్ కుంద్రా గురించి షాకింగ్ విషయాలు చెప్పిన మోడల్.. వీడియో కాల్ లో అలా..

Suspected Death: భార్య ఉండగానే రెండో పెళ్లి.. కట్ చేస్తే భర్త అనుమానాస్పద మృతి.. సెల్ఫీ వీడియోలో అసలు నిజం..!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!