చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం

హైదరాబాద్ లంగర్ హౌస్‌లో చిన్నారి వైష్ణవి కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో చిన్నారి వైష్ణవి ఆచూకీ లభ్యమైంది. తండ్రే పాపను కిడ్నాప్ చేయించినట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల వల్ల తండ్రే పాపను కిడ్నాప్ చేయించాడని అంటున్నారు. హైదరాబాద్ లంగర్‌హైస్‌లో ప్రశాంత్‌నగర్‌లోని గ్రౌండ్స్ సమీపంలో నివాసం ఉండే చిరంజీవి, జ్యోతి దంపతుల కుమార్తె వైష్ణవి. స్కూల్ నుంచి వచ్చిన వైష్ణవి ఇంటి దగ్గర ఆడుకుంటూ ఒక్కసారిగా మాయమైంది. చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన […]

చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం

Edited By:

Updated on: Jul 11, 2019 | 4:08 PM

హైదరాబాద్ లంగర్ హౌస్‌లో చిన్నారి వైష్ణవి కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో చిన్నారి వైష్ణవి ఆచూకీ లభ్యమైంది. తండ్రే పాపను కిడ్నాప్ చేయించినట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల వల్ల తండ్రే పాపను కిడ్నాప్ చేయించాడని అంటున్నారు.

హైదరాబాద్ లంగర్‌హైస్‌లో ప్రశాంత్‌నగర్‌లోని గ్రౌండ్స్ సమీపంలో నివాసం ఉండే చిరంజీవి, జ్యోతి దంపతుల కుమార్తె వైష్ణవి. స్కూల్ నుంచి వచ్చిన వైష్ణవి ఇంటి దగ్గర ఆడుకుంటూ ఒక్కసారిగా మాయమైంది. చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించగా.. చిన్నారిని ఓ వృద్ధుడు ఎత్తుకెళుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ప్రశాంత్ నగర్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా చిన్నారిని ఎత్తుకెళ్లిన దృశ్యాలను పోలీసులు గుర్తించారు. చివరికి వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో వైష్ణవి ఆచూకీ లభ్యమైంది. కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారించారు. కుటుంబకలహాల వల్ల తండ్రే పాపను కిడ్నాప్ చేయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.