
బుధవారం రైతు దినోత్సవమని, ఇన్ని రోజులుగా అన్నదాతలు చేస్తున్న ఆందోళన ముగియవచ్చునని ఆశిస్తున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని వారిని గ్రీట్ చేస్తూ ఆయన.. ఈ దేశానికి వారు ఆహారాన్ని, భద్రతను ఇస్తున్నారని, ప్రభుత్వం వారి డిమాండ్ల విషయంలో పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తోందని అన్నారు. రైతుల విషయంలో ప్రధాని మోదీ… మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ ను ఆదర్శంగా తీసుకున్నారని, అన్నదాతల మేలుకోసం కృషి చేస్తున్నారని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. చరణ్ సింగ్ జయంతిని పురస్కరించుకుని కూడా రాజ్ నాథ్ ఈ విషయాన్ని ప్రస్తావించారు.
ఇలా ఉండగా రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. యూపీలో పిలిభిత్, మొరాదాబాద్ లలో నిన్నఅన్నదాతలపై పోలీసుల చర్యను నిరసిస్తూ సింఘు బోర్డర్ లో వారు నిరసనను ఉధృతం చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిష్టిబొమ్మను తగులబెడతామని హెచ్చరించారు. అటు-మొరాదాబాద్ లో 8 గంటల అనంతరం టోల్ ప్లాజాను రైతులు ‘విముక్తం’ చేశారు. ఇన్ని గంటలపాటు వారు దీన్ని తమ ‘అధీనంలో’ ఉంచుకున్నారు.
आज किसान दिवस के अवसर मैं देश के सभी अन्नदाताओं का अभिनंदन करता हूँ। उन्होंने देश को खाद्य सुरक्षा का कवच प्रदान किया है।
कृषि क़ानूनों को लेकर कुछ किसान आंदोलनरत हैं। सरकार उनसे पूरी संवेदनशीलता के साथ बात कर रही है। मैं आशा करता हूँ कि वे जल्द ही अपने आंदोलन को वापिस लेगें।
— Rajnath Singh (@rajnathsingh) December 23, 2020