కేంద్రం జరుపుతున్న చర్చలకు సానుకూలంగా స్పందిస్తున్న రైతు సంఘాలు

మొత్తం 4 అంశాలతో చర్చల అజెండాను ప్రతిపాదించారు. వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత అంశాలు ఎజెండాలో ఉండాల్సిందే అని రైతు సంఘాలు ఇప్పటికే స్పష్టం చేశాయి.

కేంద్రం జరుపుతున్న చర్చలకు సానుకూలంగా స్పందిస్తున్న రైతు సంఘాలు

Edited By: Ravi Kiran

Updated on: Dec 30, 2020 | 7:04 PM

Farmers Protest Breaking News : ఢిల్లీలో రైతు సంఘాలతో కేంద్రం చర్చలు కొనసాగుతున్నాయి. విజ్ఞాన్‌భవన్‌లో రైతు సంఘాలతో చర్చలు జరుపుతున్నారు కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌ , పీయూష్‌ గోయెల్‌. రైతులకు కేంద్రం చర్చలు జరపడం ఇది ఆరోసారి.. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో పాటు కనీసమద్దతు ధరను చట్టంలో చేర్చాలని రైతు సంఘాలు ఎజెండాగా పెట్టాయి. చర్చలు తప్పకుండా ఫలిస్తాయని నమ్మకంతో ఉంది కేంద్రం. తాజాగా రైతులతో కలిసి మంత్రులు భోజనాలు చేస్తున్నారు.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Dec 2020 05:30 PM (IST)

    రైతుల డిమాండ్లపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు.. కేంద్రం

    మూడు వ్యవసాయ చట్టాలకు సంబంధించి రైతుల డిమాండ్లపై ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రులు రైతు నాయకులతో చెప్పారు.

  • 30 Dec 2020 04:49 PM (IST)

    వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం భావించట్లేదు.. రిపోర్ట్స్

    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న సమావేశంలో కేంద్ర మంత్రులు మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం లేదని రైతులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఉద్యమాన్ని విరమించే వరకు ప్రభుత్వం ఎలాంటి సంస్కరణలు, హామీలు ఇవ్వలేదని స్పష్టం చేశారట. రైతులు ఆందోళనను విరమించినప్పుడే ఎంఎస్‌పీకి సంబంధించి రైతుల డిమాండ్ పరిగణనలోకి వస్తాయని తేల్చినట్లు తెలుస్తోంది.


  • 30 Dec 2020 04:45 PM (IST)

    నిరసనలో మరణించిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్..

    నిరసనల్లో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని సమావేశంలో రైతు నాయకులూ డిమాండ్ చేశారు.

  • 30 Dec 2020 04:41 PM (IST)

    రైతులతో కలిసి ఆహారం ఆరగించిన కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పియూష్ గోయల్

    విజ్ఞాన్ భవన్‌లో ఓ ఆసక్తికర సీన్ చోటు చేసుకుంది. కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పియూష్ గోయల్ రైతు నాయకులతో కలిసి విందు ఆరగించారు. అనంతరం మూడు వ్యవసాయ చట్టాలపై చర్చలు జరపబోతున్నారు.

  • 30 Dec 2020 04:39 PM (IST)

    భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు కీలక ప్రకటన..

    భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు నరేష్ టికైట్ కీలక ప్రకటన చేశాడు. ప్రభుత్వం రెండు అడుగులు వెనక్కి వెళ్తే.. రైతులు రెండున్నర అడుగులు వెనక్కి వెళ్తారని.. ప్రధాని తలవంచరు, రైతులు కూడా తల వంచరని స్పష్టం చేశాడు.

  • 30 Dec 2020 04:35 PM (IST)

    రైతులకు ఆహారం విజ్ఞాన్ భవన్ చేరుకుంది…

    ఢిల్లీ సిక్కు రైతులకు గురుద్వారా కమిటీ నుంచి 500 మంది రైతులకు ఆహారం విజ్ఞాన్ భవన్ చేరుకుంది. భవన్ బయట ఉన్నవారుతో పాటు లోపల సమావేశానికి హాజరైన ఆహారం తీసుకోనున్నారు.

  • 30 Dec 2020 04:33 PM (IST)

    కేంద్రంతో చర్చలకు ముందు ‘కిసాన్ కాంగ్రెస్’ సర్వధర్మ పూజ..

    కేంద్రం ప్రవేశపెట్టిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు సంబంధించి రైతులు చర్చించే ముందు బుధవారం ఢిల్లీ-హర్యానా తిక్రీ సరిహద్దులో కిసాన్ కాంగ్రెస్ ‘సర్వధర్మ పూజ’ నిర్వహించింది.

  • 30 Dec 2020 04:30 PM (IST)

    రైతులకు, కేంద్రం మధ్య చర్చలు ప్రారంభం..

    విజ్ఞాన్ భవన్‌లో రైతులకు, కేంద్రం మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పియూష్ గోయల్ 40 మంది రైతులతో చర్చిస్తున్నారు.