
టాలీవుడ్ లో విషాదం నెలకుంది. అచ్చ తెలుగు ఫోక్ సాంగ్స్‌తో శ్రోతల మనసుల్లో చెరిగిపోని స్థానం సంపాదించుకున్న ప్రముఖ గేయ రచయిత, గాయకుడు లింగరాజ్( 66) బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మాయదారి మైసమ్మ, కోడిపాయె లచ్చమ్మ వంటి కుర్రకారును ఒక ఊపు ఊపేసిన పాటలు ఆయన పాడినవే. తన కెరీర్ లో సుమారు 1000 కి పైగా పాటలు పాడాడు లింగరాజ్. 1987లో పాడిన మాయదారి మైసమ్మ సాంగ్..సంగీత ప్రయాణంలో అతడి ప్రయాణాన్ని మలుపు తిప్పింది.
బొల్లారం ఆదర్శనగర్‌లో నివశించే లింగరాజ్.. స్నేహితులతో కలిసి డిస్కో రికార్డింగ్ కంపెనీ (డీఆర్‌సీ) పేరితో ఒక టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారు. వారితో కలిసి ఎన్నో జానపద గేయాలు పాడారు. దేవుళ్లు, దేవతలకు సంబంధించిన భజన పాటలు కూడా ఆయన స్వరకల్పన చేశారు. కాగా లింగరాజ్ కు భార్య , ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నిన్న సాయంత్రం అతని అంత్రక్రియలు ముగిశాయి. లింగరాజ్ లేరనే వార్త తెలియడంతో..ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు.
Also Read :