బాత్రూమ్‌లో పడి ఉన్న అద్దం విలువ ఏడున్నర లక్షలు !
నీవు రాయన్నది ఒకనాటికి రత్నమవునురా అంటాడు సినారె ఓ పాటలో.. నిజమే.. మనం రాయి అనుకుని పక్కన పడేసింది ఎప్పుడో ఒకప్పుడు రత్నంలా మెరవొచ్చు.. ఇలాగే లండన్‌లోని ఓ కుటుంబం విలువైనదని తెలియక ఓ అద్దాన్ని బాత్రూంలో వేలాడదీసింది.. చరిత్ర కలిగిన ఆ పురాతన అద్దాన్ని ఇప్పుడు వేలం వేస్తే ఎనిమిది వేల పౌండ్లు పలికింది.. మన కరెన్సీలో చెప్పాలంటే ఏడున్నర లక్షల రూపాయల పైచిలుకు.. అంత ధర పలికే సరికి ఆ కుటుంబ సభ్యులే ఆశ్చర్యపోయారు.. […]

నీవు రాయన్నది ఒకనాటికి రత్నమవునురా అంటాడు సినారె ఓ పాటలో.. నిజమే.. మనం రాయి అనుకుని పక్కన పడేసింది ఎప్పుడో ఒకప్పుడు రత్నంలా మెరవొచ్చు.. ఇలాగే లండన్‌లోని ఓ కుటుంబం విలువైనదని తెలియక ఓ అద్దాన్ని బాత్రూంలో వేలాడదీసింది.. చరిత్ర కలిగిన ఆ పురాతన అద్దాన్ని ఇప్పుడు వేలం వేస్తే ఎనిమిది వేల పౌండ్లు పలికింది.. మన కరెన్సీలో చెప్పాలంటే ఏడున్నర లక్షల రూపాయల పైచిలుకు.. అంత ధర పలికే సరికి ఆ కుటుంబ సభ్యులే ఆశ్చర్యపోయారు.. ఆ అద్దానికి ఎందుకంత ధర అంటే ఆ అద్దాన్ని ఫ్రాన్స్ చివరి రాణి మేరీ అంటోనిట్టే వాడారు కాబట్టి.. 18వ శతాబ్దానికి చెందిన ఆ అద్దం విలువేమిటో ఈస్ట్ బ్రిస్టల్ వేలం కంపెనీ గుర్తించింది కాబట్టి ఆ కుటుంబానికి అన్నేసి డబ్బులొచ్చాయి.. అద్దం చుట్టుతా ఉన్న నగిషీలను 19వ శతాబ్దంలో చెక్కారట! ఫ్రేమ్ అచ్చమైన వెండితో తయారు చేశారు.. ఈ అద్దం మొదట మేరీ అంటోనిట్టే దగ్గర ఉండేది.. మేరీ ఆంటోనిట్టే ఫ్రాన్స్ చిట్ట చివరి రాణి.. లూయిస్ 16ను పెళ్లి చేసుకున్న ఆమె 1774 నుంచి 1792 వరకు పరిపాలన సాగించారు.. ఫ్రెంచ్ విప్లవం సమయంలో ఆమెను ఉరి తీశారు. తర్వాత ఈ అద్దాన్ని మూడో నెపోలియన్ భార్య ఎంప్రెస్ యూజీ కొనేసుకున్నారు.. ఈ అద్దమే కాదు… మేరీ ఆంటోనిట్టే ఎస్టేట్ నుంచి ఎప్రెస్ యూజీ చాలా వస్తువులనే కొనుక్కున్నారు.. గతం నుంచి ఇప్పుడు వర్తమానికి వస్తే.. ఇంతకాలం అద్దం విలువ తెలియక బాత్రూమ్‌లో వేలాడదీశామని కుటుంబసభ్యుడు అంటున్నాడు.. వాళ్ల అమ్మమ్మ నుంచి వారసత్వంగా అద్దం వారికి వచ్చిందట! ఇక ఈస్ట్ బ్రిస్టల్ వేలం కంపెనీకి చెందిన ఖాన్ కూడా అద్దాన్ని తెగ పొగిడేశారు.. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ఈ అద్దం ఇంతకాలం బాత్రూమ్‌లో ఉండటమే బాధ కలిగిస్తున్నదన్నారు.

