క్రికెట్ ఆడొద్దన్నందుకు.. టార్గెట్ చేసి చితకొట్టారు..

హర్యానా గుర్‌గ్రామ్‌లో అల్లరిమూకలు చెలరేగాయి. ఓ కుటుంబంపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 40 మంది ఒకేసారి దాడి చేశారు. మహిళలపై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. మహిళలు ప్రాధేయపడినప్పటికీ వినలేదు. కాగా.. స్టోరీలోకి వెళ్తే.. తమ ఇంటి ముందు క్రికెట్ ఆడవద్దని అన్నందుకు ఆ కుటుంబాన్ని టార్గెట్ చేశారు ఆ దుండగులు. రాళ్లతో దాడి చేయడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు […]

క్రికెట్ ఆడొద్దన్నందుకు.. టార్గెట్ చేసి చితకొట్టారు..

Edited By:

Updated on: Mar 23, 2019 | 11:38 AM

హర్యానా గుర్‌గ్రామ్‌లో అల్లరిమూకలు చెలరేగాయి. ఓ కుటుంబంపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 40 మంది ఒకేసారి దాడి చేశారు. మహిళలపై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. మహిళలు ప్రాధేయపడినప్పటికీ వినలేదు.

కాగా.. స్టోరీలోకి వెళ్తే.. తమ ఇంటి ముందు క్రికెట్ ఆడవద్దని అన్నందుకు ఆ కుటుంబాన్ని టార్గెట్ చేశారు ఆ దుండగులు. రాళ్లతో దాడి చేయడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దుండగులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. గల్లీ క్రికెట్ వివాదం కాస్తా పెద్ద గొడవకు కారణం కావడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు కుటుంబసభ్యులు.