
Fake Doctor Arrest: చదివింది ఐదో తరగతి.. కానీ సూటు, బూటు వేసుకుని పెద్ద డాక్టర్‌గా చలామణీ అవుతూ వచ్చాడు. ఎన్నో ప్రముఖ హాస్పిటల్స్‌లో నకిలీ సర్టిఫికెట్స్‌తో పని చేసి.. ఏకంగా రాచకొండ పోలీసులకే మస్కా కొట్టాడు. సీనియర్ పోలీసు అధికారులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి.. కరోనా బారిన పడిన పోలీస్ సిబ్బందికి వైద్యం అందించాడు. ఆఖరికి రౌడీషీట్ ఎత్తేయిస్తానంటూ రూ.5 లక్షలు వసూలు చేయడంతో ఈ నకిలీ డాక్టర్‌పై పోలీసులకు అనుమానమొచ్చి.. ఆరా తీయడంతో గుట్టు రట్టయ్యింది.
నకిలీ వైద్యుడిగా చలామణీ అవుతున్న తేజారెడ్డి(23), ఒంగోలులోని గీతాంజలి కన్సల్టెన్సీ నిర్వాహకుడు బోకూడి శ్రీనివాస్‌రావు(50), వైఎస్ తేజ తండ్రి వీరగంధం వెంకటరావు(41)లను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేయగా.. వీరి నుంచి 21 రకాల నకిలీ ధ్రువీకరణ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఆరుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారు.
నగరంలోని అనేక కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యుడిగా పని చేసిన తేజారెడ్డి(23).. ఫిబ్రవరి 2020 వరకు వైద్య శిబిరాలు నిర్వహించాడు. లాక్‌డౌన్ మొదలైన తర్వాత క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఔషధాలను అందజేశాడు. రాచకొండ కోవిడ్ కంట్రోల్ రూంలో వాలంటీర్‌గా చేరాడు. కరోనా బారిన పడిన సిబ్బందికి వైద్యం చేశాడు. అంతేకాదు ఆసుపత్రుల్లో పని చేసేటప్పుడు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులతో పరిచయం పెంచుకునేవాడు. తాను ఏపీ సీఎం జగన్‌కు చుట్టమంటూ ఎంతో మందికి టోకరా ఇచ్చి… రూ. 15 లక్షల రుణం ఎగ్గొట్టాడు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే ఈ ఏడాది జూలైలో రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యను కూడా వేధింపులకు గురి చేయడంతో ఆమె కేసు పెట్టింది. ఆ సమయంలో రౌడీ షీటర్‌కు చెందిన వాహనానికి ప్రభుత్వం వాహనం అని స్టిక్కర్ వేయించుకుని తిరిగాడు. దీనితో పోలీసులకు అనుమానమొచ్చి ఆరా తీయగా మొత్తం గుట్టంతా బయటపడింది. కాగా, ఈ నకిలీ డాక్టర్ బెంగళూరులో కూడా ఇదే తరహా మోసం చేసినట్లు తెలుస్తోంది.
Also Read:
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 11న ఖాతాల్లోకి నగదు జమ.!
బ్యాంక్ కస్టమర్లకు షాక్.. సెప్టెంబర్ 15 నుంచి కొత్త రూల్..
ఇంటర్ అకడమిక్ క్యాలెండర్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..
ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్ టికెట్స్ వచ్చేశాయి..