వాటిని ఇకపై అనుమతించబోం – ఫేస్‌‌‌‌బుక్

న్యూజిలాండ్ లోని మసీద్ లో కాల్పులు జరిపి 50 మందిని పొట్టనబెట్టుకున్నాడు శ్వేత జాతి ఉన్మాది. ఇక ఆ ఘటనను ఫేస్‌‌‌‌బుక్ లో లైవ్‌ స్ట్రీమ్‌ కూడా చేశాడు. ఈ ఘటన మార్చి 15న జరిగిన విషయం తెలిసిందే. దీనితో ఎఫ్‌బి (ఫేస్‌బుక్‌) మేల్కొంది . ఇకపై జాతి విద్వేష, జాత్యహంకార ప్రకటనలు, ప్రసంగాలతో పాటు వేర్పాటువాద అంశాలను అనుమతించబోమని స్పష్టం చేసింది. వచ్చే వారం నుండి అమలుకానున్న ఈ నిర్ణయం ఇన్‌స్టాగ్రామ్ కు కూడా వర్తిస్తుందని […]

వాటిని ఇకపై అనుమతించబోం - ఫేస్‌‌‌‌బుక్
Follow us

| Edited By: Vijay K

Updated on: Mar 28, 2019 | 7:00 PM

న్యూజిలాండ్ లోని మసీద్ లో కాల్పులు జరిపి 50 మందిని పొట్టనబెట్టుకున్నాడు శ్వేత జాతి ఉన్మాది. ఇక ఆ ఘటనను ఫేస్‌‌‌‌బుక్ లో లైవ్‌ స్ట్రీమ్‌ కూడా చేశాడు. ఈ ఘటన మార్చి 15న జరిగిన విషయం తెలిసిందే. దీనితో ఎఫ్‌బి (ఫేస్‌బుక్‌) మేల్కొంది . ఇకపై జాతి విద్వేష, జాత్యహంకార ప్రకటనలు, ప్రసంగాలతో పాటు వేర్పాటువాద అంశాలను అనుమతించబోమని స్పష్టం చేసింది. వచ్చే వారం నుండి అమలుకానున్న ఈ నిర్ణయం ఇన్‌స్టాగ్రామ్ కు కూడా వర్తిస్తుందని ఫేస్‌బుక్‌ తెలిపింది. వ్యక్తులు, సంస్థలు ఫేస్‌బుక్‌ తో తమ వ్యవస్థ, జాతి గొప్పతనం గురించి ప్రకటనలు చేయవచ్చు కాని.. ఇవి మరొకరిని కించపరచకూడదని పేర్కొంది.