AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ఎర్ర ఉల్లిపాయలు మంచివా.. తెల్ల ఉల్లిపాయలు ఆరోగ్యకరమా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే

ఉల్లి (Onions) చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెతను నిజం చేస్తూ ఉల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి అద్భుతమైన లాభాలను అందిస్తుంది. ఉల్లిని అన్ని వంటల్లో వాడేస్తాం. బిర్యానీ, ఫ్రైడ్ రైస్, నాన్ వెజ్ వంటకాల్లో...

Health: ఎర్ర ఉల్లిపాయలు మంచివా.. తెల్ల ఉల్లిపాయలు ఆరోగ్యకరమా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Red And White Oniions
Ganesh Mudavath
|

Updated on: Aug 20, 2022 | 7:17 AM

Share

ఉల్లి (Onions) చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెతను నిజం చేస్తూ ఉల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి అద్భుతమైన లాభాలను అందిస్తుంది. ఉల్లిని అన్ని వంటల్లో వాడేస్తాం. బిర్యానీ, ఫ్రైడ్ రైస్, నాన్ వెజ్ వంటకాల్లో ఉల్లిపాయను నంజుకుని తింటే ఆ మజానే వేరు. ఉల్లిగడ్డలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా శరీరంలోని ముఖ్య భాగాలకు ఆక్సిజన్ సరఫరా జరుగుంతుంది. కణాల వృద్ధికి దోహదం చేయడంతో పాటు, ఎర్ర రక్తకణాలను వృద్ధి చేస్తుంది. రక్తహీనతతో బాధపడే వారు ఏదో ఒక రకంగా తమ ఆహారంలో ఉల్లిని భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వును తగ్గించేందుకు ఉల్లి ఉపయోగపడుతుంది. గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా పోరాడడంతో పాటు గుండెపోటు రాకుండా కాపాడుతుంది. శరీరంలో నైట్రిక్ యాసిడ్ విడుదలను ప్రోత్సహించి, అధిక రక్తపోటు లెవెల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. ఉల్లిగడ్డలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా మారుస్తుంది. ఉల్లి గుజ్జు ముఖానికి పట్టించటం వల్ల మొటిమలు, మచ్చలు పూర్తిగా తొలగిపోయి మెరిసే సౌందర్యం మీ సొంతమవుతుంది.

పచ్చి ఉల్లిపాయ ముక్కలను నమలడం వల్ల నోట్లోని హానికరమైన బ్యాక్టీరియా అంతమవుతుంది. వీటిలో ఉండే ప్రత్యేకమైన రసాయనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. సాధారణంగా మార్కెట్లో ఎర్ర ఉల్లిగడ్డలు, తెల్ల ఉల్లిగడ్డలు లభిస్తాయి. అయితే ఎర్ర పాయల్లో కంటే తెల్ల పాయల్లోనే ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. తెల్ల ఉల్లిని తినడం ద్వారా ఎర్ర ఉల్లి ద్వారా లభించే ఆరోగ్య ప్రయోజనాల కంటే ఎక్కువ లాభాలను పొందవచ్చు.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..