Expert committe meeting: సిరమ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగంపై వీడని ఉత్కంఠ.. మళ్లీ సమావేశం కానున్న కమిటీ సభ్యులు.
Expert Committe Meeting On Vaccine: దేశంలో వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి పలు ఇన్‌స్టిట్యూట్‌లు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఇటీవల దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో బుధవారం నిపుణుల బృందం సమావేశమైన విషయం తెలిసిందే..

Expert Committe Meeting On Vaccine: దేశంలో వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి పలు ఇన్‌స్టిట్యూట్‌లు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఇటీవల దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో బుధవారం నిపుణుల బృందం సమావేశమైన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులివ్వాలని ఫైజర్, సిరమ్, భారత్ బయోటిక్ కంపెనీలు చేసుకున్న అభ్యర్థను పరిగణలోకి తీసుకున్న కమిటీ, సదరు సంస్థలు ఇచ్చిన డేటాను పరిశీలించాయి. అనంతరం.. దేశంలో వ్యాక్సిన్‌ల అత్యవసర వినియోగంపై నిర్ణయం తీసుకునే విషయమై నిపుణుల బృందం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ కమిటీ (ఎస్‌సీఈ) మరోసారి జనవరి 1న సమావేశమై.. ఫైజర్, సిరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటిక్ కంపెనీలు తయారు చేస్తున్న వ్యాక్సిన్ విషయమై చర్చించనున్నారు. మరి జనవరి 1న జరిగే సమావేశంలోనైనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగంపై సానుకూల ప్రకటన వస్తుందో చూడాలి. Also Read: ఏపీలో నిలకడగా కరోనా, గడిచిన 24 గంటల్లో 349 మందికి పాజిటివ్, ఉద్ధృతి తగ్గినప్పటికీ నేనున్నానంటోన్న మహమ్మారి
