AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Argentina : అబార్షన్లను చట్టబద్ధం చేసిన అర్జెంటీనా.. హర్షం వ్యక్తం చేసిన ప్రజలు..!

అర్జెంటీనా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అక్కడి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పైన సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి...

Argentina : అబార్షన్లను చట్టబద్ధం చేసిన అర్జెంటీనా.. హర్షం వ్యక్తం చేసిన ప్రజలు..!
Rajeev Rayala
|

Updated on: Dec 30, 2020 | 9:54 PM

Share

Argentina : అర్జెంటీనా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అక్కడి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కొంతమంది హర్షం వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇంతకు ఆ నిర్ణయం ఏంటంటే.. అబార్షన్లను చట్టబద్ధం చేస్తూ అర్జెంటీనా సంచలన నిర్ణయం తీసుకుంది. దాంతో బ్యూనస్‌ ఏర్స్‌లో ఉన్న సెనేట్‌ భవనం ముందు నిరీక్షిస్తున్న వేలాది మంది ప్రజలు హర్షద్వానాలతో కొత్త చట్టానికి మద్దతు పలికారు. చాలా మంది ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు కూడా చేశారు. 2018లోనే ఈ చట్టం తీసుకొచ్చేందుకు విఫలయత్నం జరిగింది. అప్పుడు ప్రవేశపెట్టిన బిల్లును దిగువసభ ఆమోదించినప్పటికీ స్వల్ప ఓట్ల తేడాతో సెనేట్‌లో వీగిపోయింది. ఇప్పుడు పాలకపక్షం అనుమతితో బిల్లు ఆమోదం పొందింది.సుమారు నాలుగున్నర కోట్ల మంది జనాభా గల అర్జెంటీనాలో ప్రతియేటా చట్టవిరుద్ధంగా వేలాది అబార్షన్లు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చాలా మంది అబార్షన్లను అనుమతించవద్దని నిరసన తెలిపారు. అబార్షన్లను అనుమతించొద్దని… అది శిశువుల జీవించే హక్కును హరించడమేనంటూ… కేథలిక్ చర్చి వ్యతిరేకతను కాదని అర్జెంటీనా సెనేట్‌ 38-29 ఓట్ల తేడాతో ఈ చట్టాన్ని ఆమోదించింది. లాటిన్‌ అమెరికన్‌ దేశాల్లో ఇలాంటి నిర్ణయం తీసుకున్న ప్రధాన దేశంగా అర్జెంటీనా పేరు తెచ్చుకుంది.