సోమిరెడ్డి, అమర్నాథ్ రెడ్డి అయోమయం: జేపీ ప్రభాకర్ రెడ్డికి పరామర్శ, ఏపీ సర్కారు తీరు వింతగా ఉందని వ్యాఖ్య
"ఎక్కడైనా దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేస్తారు కానీ, బాధితులపై కేసులు పెట్టడం ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే చూస్తున్నా్ం" అని టీడీపీ సీనిమయర్ నేతలు..
“ఎక్కడైనా దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేస్తారు కానీ, బాధితులపై కేసులు పెట్టడం ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే చూస్తున్నా్ం” అని టీడీపీ సీనిమయర్ నేతలు.. మాజీ మంత్రులు అమర్నాథ్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. తాడిపత్రిలో ఘర్షణలు జరిగిన నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డిని కలిసి పరామర్శించారు. జరిగిన సంఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు సోమిరెడ్డి, అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని ఘటనలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నామన్నారు. చంద్రబాబు హయాంలో ఫ్యాక్షన్ అనేది లేకుండా పోయిందని.. అయితే జగన్ వచ్చిన తరువాత మళ్లీ ఆ పార్టీ నేతలు అటు వైపు వెళ్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసీ ఇంటికి వచ్చి దాడి చేయడం రాష్ట్రం అంతా చూసిందని.. అయితే కేసులు మాత్రం జేసీ పైనే పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇలాగే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను వైసీపీ నేతలు తమ ఆధీనంలో ఉంచుకోవాలని చూస్తున్నారని.. చివరకు కోర్టులను కూడా తప్పుబడుతున్నారని అన్నారు. ప్రొద్దుటూరులో అవినీతిని ప్రశ్నించినందుకు టీడీపీ నేతను చంపేశారని.. అసలు ఈ ప్రభుత్వం ఎటు వైపు వెళ్తోందని టీడీపీ నేతలు అయోమయం వ్యక్తం చేశారు.