allu sirish : రెండు సార్లు టెస్ట్ చేయించుకున్నా.. నెగిటివ్ వచ్చింది : అల్లు శిరీష్

టాలీవుడ్ లో కరోనా కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరోలు కరోనా బారిన పడుతుండటం మెగా అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది..

allu sirish : రెండు సార్లు టెస్ట్ చేయించుకున్నా.. నెగిటివ్ వచ్చింది : అల్లు శిరీష్
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 30, 2020 | 9:37 PM

allu sirish : టాలీవుడ్ లో కరోనా కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరోలు కరోనా బారిన పడుతుండటం మెగా అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఇప్పటికే కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. మంగళవారం తనకు కరోనా పాజిటీవ్ గా తేలిందని చరణ్ స్వయంగా తెలిపాడు. కొట్టిపాటి లక్షణాలు ఉన్నట్టు చరణ్ తెలిపాడు. ఇక డే రోజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు కూడా పాజిటివ్ అని తేలింది.

కాగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా క్రిస్మస్ పార్టీలో పాల్గొన్నారు. అందరు కలిసి క్రిస్మస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు.దాంతో ఆ పార్టీలో వాళ్లందరూ ఇప్పుడు టెస్టులు చేయించుకుంటున్నారు.తాజాగా అల్లు శిరీష్ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఈ విషయంపై స్పందిస్తూ రెండుసార్లు పరీక్షలు చేయించుకున్నాను.. నెగెటివ్ వచ్చింది. ఈ విషయం మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. రెండుసార్లు నెగెటివ్ అనే వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు అల్లు శిరీష్. ఈమేరకు శిరీష్ ట్వీట్ చేసాడు.  తాను ఎప్పుడూ మాస్క్ ధరించానని, శానిటైజర్ వాడానని, అన్ని జాగ్రత్తలు పక్కాగా తీసుకున్నానని తెలిపాడు శిరీష్.