AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కవితమ్మ గొప్ప‌ మనసు.. భార్య, కూమార్తెను కోల్పోయిన వ్యక్తికి మర్చిపోలేని సాయం

తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌య‌, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత త‌న మంచి మ‌న‌సు చాటుకున్నారు. రోడ్డు యాక్సిడెంట్ లో భార్య, కూమార్తెను కోల్పోయి.. ఆ స‌మ‌యంలో గల్ఫ్ లో ఉండి‌.. వారి అంత్య‌క్రియ‌ల‌కు కూడా జ‌రుప‌లేకపోయిన‌ ఓ వ్యక్తికి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన శ్రీనివాస్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అయితే మే 15న మందమర్రిలో జరిగిన రోడ్డు యాక్సిడెంట్ లో అతడి భార్య సుజాత, పెద్ద కుమార్తె […]

కవితమ్మ గొప్ప‌ మనసు.. భార్య, కూమార్తెను కోల్పోయిన వ్యక్తికి మర్చిపోలేని సాయం
Ram Naramaneni
|

Updated on: May 25, 2020 | 5:51 PM

Share

తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌య‌, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత త‌న మంచి మ‌న‌సు చాటుకున్నారు. రోడ్డు యాక్సిడెంట్ లో భార్య, కూమార్తెను కోల్పోయి.. ఆ స‌మ‌యంలో గల్ఫ్ లో ఉండి‌.. వారి అంత్య‌క్రియ‌ల‌కు కూడా జ‌రుప‌లేకపోయిన‌ ఓ వ్యక్తికి అండగా నిలిచారు.

వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన శ్రీనివాస్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అయితే మే 15న మందమర్రిలో జరిగిన రోడ్డు యాక్సిడెంట్ లో అతడి భార్య సుజాత, పెద్ద కుమార్తె కావ్య మృతి చెందారు. లాక్ డౌన్ కార‌ణంగా దుబాయ్ నుంచి వచ్చేందుకు వీలుకుద‌ర‌క‌పోవ‌డంతో.. శ్రీనివాస్ చిన్నకూతురే వారి అంత్యక్రియలు నిర్వహించింది. వందే భారత్ మిషన్‌లో భాగంగా శ్రీనివాస్ రెండు రోజుల క్రితం హైదరాబాద్ చేర‌కున్నాడు. అయితే కేంద్ర హోంశాఖ రూల్స్ ప్రకారం అతణ్ని ప్రభుత్వం క్వారంటైన్లో ఉంచింది. తన భార్య అంత్యక్రియలకు హాజరు కాలేకపోయిన శ్రీనివాస్.. పెద్ద కర్మలకు కూడా హాజరు కాలేకపోతానేమోనని తీవ్ర ఆవేద‌న చెందాడు. దుబాయ్‌లో ఉన్న తన స్నేహితుల‌కు ఈ విషయాన్ని చెప్పి వాపోయాడు. వారు ఈ విషయాన్ని మాజీ ఎంపీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డికి అత‌డి క‌ష్టాన్ని వివరించారు. డీజీపీ ప‌ర్మిష‌న్ తీసుకొని తన ఆఫీస్ సిబ్బంది ద్వారా స్పెష‌ల్ వెహిక‌ల్ లో శ్రీనివాస్‌ను సొంతూరు పంపించారు. కవిత సహకారంతో భార్య, కూతురి క‌ర్మకాండ‌ల్లో పాల్గొన్న శ్రీనివాస్.. చిన్న కూతుర్ని, తల్లిని కనీసం తాకడానికి కూడా అవ‌కాశం లేక‌పోవ‌డంతో క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. అతణ్ని ఓదార్చిన పోలీసులు.. దశ దిన కర్మలు పూర్తయిన అనంతరం తిరిగి హైదరాబాద్ తీసుకెళ్లారు.

Follow Us
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపమా
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపమా
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!