జేసీ సూట్‌కేసులో రూ.6 లక్షలు మాయం..! దొంగ ఎవరంటే.!

టీడీపీ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సూట్‌కేసులో 6 లక్షల రూపాయలు సడన్‌గా మాయం అయ్యాయి. ఆయన సూట్‌కేసులోని డబ్బును కార్ డ్రైవర్ కాజేశాడు. దీంతో.. జేసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు.. జేసీ కార్ డ్రైవర్‌ను నిన్న అర్థరాత్రి అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 11న జేసీ దివాకర్ రెడ్డి.. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం వచ్చారు. అక్కడి నుంచి తన స్నేహితుడు త్యాగరాజు పంపిన […]

జేసీ సూట్‌కేసులో రూ.6 లక్షలు మాయం..! దొంగ ఎవరంటే.!

Edited By:

Updated on: Oct 14, 2019 | 11:44 AM

టీడీపీ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సూట్‌కేసులో 6 లక్షల రూపాయలు సడన్‌గా మాయం అయ్యాయి. ఆయన సూట్‌కేసులోని డబ్బును కార్ డ్రైవర్ కాజేశాడు. దీంతో.. జేసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు.. జేసీ కార్ డ్రైవర్‌ను నిన్న అర్థరాత్రి అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 11న జేసీ దివాకర్ రెడ్డి.. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం వచ్చారు. అక్కడి నుంచి తన స్నేహితుడు త్యాగరాజు పంపిన కారులో గాంధీ నగర్‌లోని హోటల్లో బస చేశారు జేసీ. అదే కారులో సచివాలయానికి వెళ్లిన జేసీ.. అక్కడ పాస్‌పోర్టు సైజు రెండు ఫొటోలు అవసరం పడటంతో.. పీఏని పిలిచి సూట్‌కేస్ తెప్పించుకుని.. అందులోని రెండు ఫొటోలను తీసుకున్నారు. అనంతరం ఆ సూట్‌కేస్‌కి తాళం వేయకుండా.. కారులో పెట్టమన్నారు. అక్కడినుంచి ఆయన ఐలాపురం హోటల్‌కు వెళ్లారు. గదిలోకి వెళ్లిన జేసీ.. డ్రైవర్‌కు ఫోన్ చేసి సూట్ కేస్‌ తీసుకురమ్మని చెప్పారు. డ్రైవర్ ఆ సూట్‌కేస్‌ను తెరవగా.. అందులో రెండువేల కట్టలు ఉన్నాయి. దాన్ని తీసుకుని కార్ సీట్‌ కింద దాచాడు డ్రైవర్. ఖాళీ పెట్టి తీసుకెళ్లి జేసీకి ఇచ్చాడు. సూట్‌కేస్ తెరిచి చూడగా.. డబ్బు లేకపోవడంతో.. షాక్‌ తిని పోలీసులకు ఫిర్యాదు చేశారు జేసీ. దర్యాప్తు చేసిన పోలీసులు.. డ్రైవర్‌ గౌతమ్‌పై అనుమానం రావడంతో.. విచారించగా అసలు నిజం బయటపెట్టాడు.