
రిపబ్లిక్ డే నేపథ్యంలో.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ‘ఛబ్బీస్ జనవరి’ ఈరోజు తన 55వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. వినడానికి వింతగా ఉన్నా… అతని పేరు ‘ఛబ్బీస్ జనవరి’. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడని, అపరిమితమైన దేశభక్తి కలిగిన వాడని తెలిపారు. భారత రాజ్యాగంపై నమ్మకం కలిగివుండేవారని, అందుకే తనకు ‘ఛబ్బీస్ జనవరి’ అని పేరు పెట్టారని తెలిపారు. తనకు ఇంతటి ఘనమైన పేరు పెట్టినందుకు ఎంతో గర్వపడుతున్నానని అన్నారు.
కాగా.. కొంతమంది తనను ఆటపట్టిస్తుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తన పేరు చెప్పినప్పుడు చాలామంది నమ్మరని అన్నారు. ప్రస్తుతం ‘ఛబ్బీస్ జనవరి’ డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్‌లో పనిచేస్తున్నారు. అతనికి సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్‌లో ‘ఛబ్బీస్ జనవరి’ అని రాసివుంటుంది.